మంచు ఫ్యామిలీ గొడవ... లక్ష్మి సపోర్ట్ మనోజ్కేనా.. ?
అలాంటి ఫ్యామిలీలో ఇప్పుడు ఒక్కసారిగా నిప్పు రాజుకుంది. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ రెండు రోజులుగా తెలుగు మీడియాలో ను .. తెలుగు సోషల్ మీడియాలో ను ... తెలుగు ప్రజల్లోనూ పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇలాంటి టైం లో మంచు లక్ష్మి చేసిన ఇన్ స్టా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. పీస్ అంటూ మంచు లక్ష్మి ప్రసన్న తన కుమార్తె వీడియోను షేర్ చేసింది. విచిత్రం ఏంటంటే దీనికి మంచి మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి కూడా లైక్ చేయడం మరింత చర్చకు దారితీస్తుంది. ఇంట్లో తండ్రి అన్నదమ్ముల మధ్య ఇంత గొడవ జరుగుతున్న దానిపై స్పందించట్లేదని నెటిజనులు చర్చించుకుంటున్నారు. వాస్తవంగా ఈ వివాదంలో మంచు లక్ష్మి ప్రసన్న సపోర్ట్ మంచు మనోజ్ కే అని తెలుస్తోంది.