పుష్ప 2 : హిందీ పరిస్థితి ఇది.. ఐదు రోజుల్లో ఎంత వచ్చిందో తెలిస్తే షాక్ కావాల్సిందే..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నుండి హిందీ ఏరియా నుండి సూపర్ సాలిడ్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి ఈ ఐదు రోజుల్లో ఈ సినిమా హిందీ వర్షన్ కు ఏ ఏరియా లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు హిందీ ఏరియాలో 72 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 59 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మూడవ రోజు 74 కోట్ల కలెక్షన్లు దక్కగా , నాలుగవ రోజు ఏకంగా 86 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ఐదవ రోజు ఈ మూవీ కి 48 కోట్ల కలెక్షన్లు దచ్చాయి. దానితో మొత్తంగా ఐదు రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి హిందీ ఏరియాలో ఏకంగా 339 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఇలా ఐదు రోజుల్లోనే ఈ సినిమా హిందీ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పటికే ఈ మూవీ కి సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ రావడంతో మరికొన్ని రోజుల పాటు హిందీ ఏరియాలో ఈ మూవీ పెద్ద మొత్తంలో కలెక్షన్ వసూలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ హిందీ ఏరియాలో ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: