పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ తో నటించిన అలా వైకుంఠపురం సినిమాతో పూజ హెగ్డేకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కానీ ఈ సినిమా అనంతరం ఈ భామకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది. తెలుగులో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, వరుణ్ తేజ్, నాగచైతన్య, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.
గత మూడేళ్ల నుంచి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పూజ హెగ్డే దూరంగా ఉంటుంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం పూజ హెగ్డే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. కాగా, పూజ హెగ్డే మళ్లీ తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తుంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా చేయబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకుందట. ఓవైపు టాలీవుడ్ సినిమాలలో నటించడానికి సిద్ధమవుతూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేస్తోంది. ప్రస్తుతం దేవా అనే సినిమాలో పూజ నటిస్తోంది. అనంతరం వరుణ్ ధావన్ సినిమాలో కూడా నటించడానికి సిద్ధమైందట. ఇది రొమాంటిక్ కామెడీ సినిమా. డేవిడ్ ధావన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఇందులో మృనాల్ ఠాకూర్ కీలకపాత్రలో నటించనుంది.
త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ బ్యూటీ బాలీవుడ్ లో మరో యంగ్ హీరో సినిమాకి ఒప్పందం చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. వరుసగా బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులతో పూజ హెగ్డే బిజీగా ఉంది. ఇంతకాలం పాటు ఎలాంటి సినిమా అవకాశాలు లేక సతమతమైన ఈ చిన్నది బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమా ప్రాజెక్టులకు ఓకే చెబుతుందట డబుల్ గేమ్ ఆడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.