పెదరాయుడు మూవీ రేంజ్ లో మోహన్ బాబు వార్నింగ్.. వీడియో వైరల్?

Veldandi Saikiran
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో... ప్రస్తుతం మంచు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన ఆస్తి తగాదాలు హార్ట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఏ టీవీ ఛానల్ పెట్టిన, ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియా తెరిచిన... ఎక్కడైనా మంచు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన న్యూస్ మాత్రమే వస్తోంది. మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ కుమార్ మధ్య ఉన్న తగాదాలు.. లైవ్ పెట్టి మరి చూపిస్తున్నాయి న్యూస్ చానల్స్.
 ఇక తండ్రి మోహన్ బాబు పై మంచు మనోజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు తండ్రి కూడా తగ్గేదే లేదు... అంటూ మంచు మనోజ్ కుమార్ పైన మంచు మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రచ్చ మరింత పెరిగిపోయింది.  అటు మంచు విష్ణు కూడా రంగంలోకి దిగాడు. దీంతో మంచు మనోజ్ కుటుంబం సింగిల్ అయిపోయింది.
 మనోజ్ వర్సెస్ విష్ణుగా ఈ వివాదం మారిపోయింది. ఇద్దరూ 30 నుంచి 40 మంది బౌన్సర్లను తెచ్చుకొని... యుద్ధానికి దిగుతున్నారు. దీనికి సంబంధించిన...  వార్తలను సోషల్ మీడియా కూడా అంతేగా ప్రచారం చేస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే మంచు మోహన్ బాబు కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఆయన పెదరాయుడు  రేంజ్ లో తన అనుచరులకు వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
 మనోజ్ పంపించిన బౌన్సర్లకు వార్నింగ్ ఇస్తున్నాడా...? లేక తన అనుచరులకు... వార్నింగ్ ఇస్తున్నాడా అర్థం కాలేదు కానీ.. ఆయన ఒక కుర్చీలో కూర్చొని వార్నింగ్ ఇచ్చే వీడియో అయితే వైరల్ గా మారడం జరిగింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మోహన్ బాబును టైగర్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. సినిమా రేంజ్ లో మోహన్ బాబు వార్నింగ్ ఇస్తున్నాడని కూడా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: