మంజు వారియర్ రియల్ స్టోరీ
అయితే ఇప్పుడు ఈమె ఎవరు ? ఏం చేస్తుందో ? మనం ఇప్పుడు చూద్దాం.. అయితే మంజు వారియర్ మలయాళ నటి. ఆమె వయసు 46 సంవత్సరాలు. మంజు వారియర్ 1978లో తమిళనాడులో జన్మించింది. చిన్నవయసులోనే మంజు కూచిపూడి శిక్షణలో తీసుకున్నారు. బుల్లితెరపై మనోహరం సీరియల్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 17 ఏళ్ల వయసులోనే సాక్ష్యం మూవీలో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత ఏడాది సల్లాపం సినిమాతో కథానాయికగా వెండితెరపై మెరిసింది. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 1995 నుంచి 1999 వరకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించింది. దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించి అలరించింది. నాలుగేళ్ల వ్యవధిలోనే ఉత్తమ నటిగా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. అలాగే నేషనల్ అవార్డ్, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డ్స్ ని కూడా అందుకుంది.
తన కెరీర్ మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు సల్లాపం సినిమాలో నటించిన హీరో దిలీప్ తో ప్రేమలో పడింది. అతన్ని పెళ్ళి చేసుకుని కెరీర్ కూడా వదులుకుంది. కొన్నాళ్ళ తరువాత అతను వేరే హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిసాక మంజు వారియర్ విడాకులు తీసుకుంది. దీంతో మంజు వారియర్ తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ బాధతో చాలాకాలం పాటు తెరకు దూరమయ్యింది. 15 ఏళ్ళ గ్యాప్ తరువాత తిరిగి మేకప్ వేసుకుంది, మళ్ళీ టాప్ పొజిషన్‌కి చేరుకుంది.