Rc 16లో మరో స్టార్ హీరో.. ఎవరంటే?

MADDIBOINA AJAY KUMAR
మెగా హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో జనవరి 10న ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ సినిమా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ మూవీ పూర్తవడంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమా పనుల్లో బిజీ అయిపోయారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'ఆర్సీ 16' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా నవంబర్ నెలలో  మైసూర్ కూడా వెళ్లారు. ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ రూమర్ బయటికి వచ్చింది. ఆర్సీ 16 సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు సమాచారం. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన ఎంట్రీ ఇస్తే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని అభిమానులకు అనుకుంటున్నారు.

ఇకపోతే బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో మంచి స్నేహబంధం ఉందని అందరికీ తెలుసు. అయితే గతంలో ఆయన చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించారు. అందులో నటించినందుకు ఆయన ఒక్క పైసా కూడా తీసుకోకపోవడంతో వారి స్నేహబంధం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తారని మెగా ఫాన్స్ నమ్ముతున్నారు. దీనికి సంబంధించిన సమాచారం సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఈ కాంబో సెట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: