నా పిల్లల జోలికి వస్తే ఊరుకోను... మనోజ్ భార్య స్ట్రాంగ్ వార్నింగ్

MADDIBOINA AJAY KUMAR
సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంటా మరోసారి విభేదాలు చోటుచేసుకున్నాయి. గత కొంత కాలంగా మంచు కుటుంబంలో ఆస్తి గురించి గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలుసు. అయితే మరోసారి ఈ కుటుంబంలో ఆస్తి గొడవలు నెలకొన్నాయి. దీంతో మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్ లో తన తండ్రిపై ఫిర్యాదు చేశాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే గతంలో మంచు విష్ణు, మనోజ్ కొట్టుకున్న విషయం తెలిసిందే. తన పెళ్లి తర్వాత విష్ణు తనపై దాడి చేస్తాడని మంచు మనోజ్ రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. అయితే ఆ వీడియో రియాలిటీ షోలో భాగంగా తీసింది అని మంచు విష్ణు కవర్ చేశారు. అయితే ఇప్పుడు ఆస్తుల విషయంలో మంచు మోహన్‌బాబు, మనోజ్‌ మధ్య గొడవ జరిగిందని మీడియాలో ప్రచారం జరిగింది. ఆ గోడవలో సినీ నటుడు మంచు మనోజ్ గాయపడ్డారు. ఆ గాయాలతో ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి మోహన్ బాబుపై కంప్లైంట్ ఇచ్చారు. మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు.
దీంతో నేడు మంచు మనోజ్ భార్య మౌనిక రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. నా పిల్లల జోలికి వస్తే ఊరుకోనని ఫోన్ కాల్ లో హెచ్చరించింది. తన ఫ్యామిలీ జోలికి వస్తే ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తానని మౌనిక ఫైర్ అయ్యింది. తన భర్త మనోజ్ కి దెబ్బలు తగిలాయని..  ఈ వ్యవహారాన్ని న్యాయంగా వ్యవహరించాలని మౌనిక కోరారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా, తాజాగా మోహన్ బాబు ఎంతలో నేడు సాయంత్రం జరిగిన వల్ల ఆయన టెన్షన్ తో అస్యస్టతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: