అల్లు అర్జున్ కు బిగ్ షాక్..హిందీలో నెంబర్‌ వన్‌ హీరో అతనే ?

Veldandi Saikiran
అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప-2 హవా ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. అల్లు అర్జున్ కు భారీ ఎత్తున అభిమానులు పుష్ప సినిమాతోనే వచ్చారు. పాన్ ఇండియా హీరోగా అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో అల్లు అర్జున్ సినిమాలు మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాయి. అయితే అల్లు అర్జున్ కన్నా ప్రస్తుతం మన తెలుగు హీరో ఒకరికి ఉత్తరాదినా ఎక్కువగా క్రేజ్ ఉంది.

ఆ హీరో ఎవరు అని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అతను ఎవరో కాదు రామ్ పోతినేని. రామ్ హిందీ డబ్బింగ్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా గూగుల్ లో రామ్ గురించి ఎక్కువగా వెతుకుతున్నారు. రామ్ సినిమాలను చూడడానికి ఎక్కువగా అభిమానులు ఆసక్తిని చూపిస్తున్నారు. హిందీలో మన తెలుగు సినిమాలను డబ్ చేసి యూట్యూబ్ లలో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ మన సినిమాకు ఎక్కువగా ఆదరణ వస్తోంది. రవితేజ, రామ్, బన్నీ, ఎన్టీఆర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది.

ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు విశేష ఆదరణ దక్కుతుంది. ఇందులో రామ్ పోతినేని మొదటి స్థానంలో నిలుస్తున్నారు. ఆయన నటించిన నేను శైలజ సినిమా ఇప్పటివరకు అత్యధిక వ్యూస్ సాధించడం విశేషంగా నిలిచింది. నేను శైలజ ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా ఉంది. ఇది 483 మిలియన్ వ్యూస్ తో రెండవ స్థానంలో ఉంది.

415 మిలియన్ల వ్యూస్ తో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా మూడవ స్థానంలో నిలిచింది. 353 మిలియన్ వ్యూస్ తో అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను నాలుగవ స్థానంలో ఉంది. 39 మిలియన్ వ్యూస్ తో రామ్ నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ ఐదవ స్థానంలో నిలిచింది. అందరికన్నా ఎక్కువగా రామ్ నటించిన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: