పుష్ప2 ఎఫెక్ట్: రామ్ చరణ్ చేయాల్సిన బడా ప్రాజెక్టు బన్ని ఖాతాలోకి.. ఇప్పుడు కదా అసలైన మజా స్టార్ట్..!?

Thota Jaya Madhuri
సోషల్ మీడియాలో బాగా మెగా వర్సెస్ అల్లు వార్  హిట్ పెంచేస్తూ వస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే.  ఒకటి కాదు రెండు కాదు దాదాపు 12,500 ధియేటర్లో పుష్ప2 సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది . సినిమా మొత్తం ఒక లెక్క సినిమాలో జాతర ఎపిసోడ్ మాత్రమే ఒక లెక్క అనే విధంగా తెరకెక్కించాడు సుకుమార్ . జాతర ఎపిసోడ్ మరి మరి హైలైట్ గా మారింది . అంతేకాదు ఈ సీన్ కోసమే థియేటర్స్ కి వెళ్లి మరీ పుష్ప సినిమా చూస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు .


అలాంటిది ఇప్పుడు పుష్ప 2 సినిమా హిట్ అయిన కారణంగా ఓ బడా డైరెక్టర్ బన్నీకి కాల్ చేసి మరి నా డైరెక్షన్ లో సినిమాలో నటించాలి అంటూ అడుగుతున్నారట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. సంజయ్ లీలా భన్సాలీ.  బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన పేరుకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా చాలా మంది తెలుగు స్టార్స్ కూడా ఆయనతో వర్క్ చేయాలి అంటూ ఆయన డైరెక్షన్ లో నటించాలి అంటూ ఆశపడుతూ ఉంటారు .


అలాంటిది స్టార్ డైరెక్టర్ డైరెక్ట్ గా బన్నీకే కాల్ చేసి మరి నీతో వర్క్ చేయాలని ఉంది అంటూ పొగడటం నిజంగా గ్రేట్ . అంతే కాదు గతంలో రామ్ చరణ్ - సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఒక సినిమా లో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి . అయితే ఇప్పుడు బన్నీతో సినిమా చేయాలి అనుకుంటున్నాడు అంటూ వార్తలు రావడంతో బహుశా చరణ్ తో తెరకెక్కించాల్సిన కధనే బన్నీతో తెరకెక్కిస్తున్నాడా ..? అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బన్ని ఫ్యాన్స్  తెగ ట్రెండ్ చేస్తున్నారు. చూడాలి మరి దీని పై అఫిషియల్ అప్ డేట్ ఎప్పుడు వస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: