బాలీవుడ్లో పుష్ప2 హిస్టరీ.. టాప్ 5 కలెక్షన్లు సాధించిన సినిమాలు ఇవే..,,!

Amruth kumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నార్త్ ఇండియా మార్కెట్లో ఎప్పటినుంచో భారీ ఫాలోయింగ్ ఉంది అనే మాటని కేవలం యూట్యూబ్ వ్యూస్ వరకు మాత్రమే కాకుండా థియేటర్స్లోకి ప్రేక్షకులని రప్పించి ఇప్పటికే పుష్ప పార్ట్ వన్ తో భారీ కలెక్షన్లు చూపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సిక్కుల్ గా వచ్చిన పుష్ప ది రూల్ ఇప్పుడు ఒక హిస్టారికల్ ఓపెనింగ్స్ ని సాధించి చరిత్ర తిరగరాసింది. ఇక బాలీవుడ్ లో ఎప్పుడు నుంచో పాతుకుపోయిన బడా స్టార్స్ సెట్ చేసిన రికార్డులను సైతం పుష్ప 2 తన కలెక్షన్ల సునామీతో చెత్తబుట్టలో పడేసాడు .

బాలీవుడ్ లో ఏకంగా పుష్ప 2 72 కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టి చరిత్ర తిరగరాసి అల్లు అర్జున్ హిందీ హీరోలను మించిపోయే క్రెజ్‌ను తెచ్చిపెట్టింది. ఇక దీంతో పుష్ప 2 వెనకే మిగతా సినిమాలు ఉండగా ఇప్పుడు ఉన్న టాప్ 5 ఓపెనింగ్ సినిమాల లిస్టు ఇక్కడ చూద్దాం. ఇక ఇప్పుడు మొదటిగా టాప్ 1 స్థానంలో పుష్ప 2 కేవలం హిందీ వర్షన్ లోనే 72 కోట్లకు కలెక్షన్లు రాబట్టింది. ఇక టాప్ 2 లో బాలీవుడ్ బాద్షా షారుఖాన్ నటించిన జవాన్ 65 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. వీటితో పాటు టాప్ 2 లో శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన స్త్రీ 2 .. 55 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టింది. అలాగే టాప్ 4 లో మరోసారి షారుక్ ఖాన్ నటించిన పటాన్ సినిమా 55 కోట్ల కలెక్షను రాబట్టింది.

ఇక టాప్ 5లో రన్బీర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వ‌చ్చిన య‌నిమల్ సినిమా 55 కోట్ల కలెక్షన్లు సాధించింది .. ఇలా టాప్ 5 బాలీవుడ్ సినిమాల్లో మొదటి స్థానం ఇప్పుడు పుష్ప 2 అందుకొని బిగ్గెస్ట్ రికార్డును క్రియేట్ చేసింది . అలాగే మొదటి రోజు కలెక్షన్లతోనే కాకుండా పుష్ప 2 రెండో రోజు కలెక్షన్లు కూడా బాలీవుడ్ లో అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసింది . తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసింది . ఇదే రకంగా పుష్ప 2 కలెక్షను సునామి కొనసాగితే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త అధ్యాయం లిఖించడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: