అలా చేయడం ఇష్టం లేకనే మీటింగ్ కి మెగాస్టార్ డుమ్మా.. మహా తెలివైనవాడే..!

Thota Jaya Madhuri
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది ఉన్నట్టు మాట్లాడే టైప్ . అంతే కాదు ఇప్పుడు ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ పెద్దగా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పుడు అందరు మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ లో ఎందుకు పాల్గొనలేదు..? అంటూ గుసగుసలాడుకుంటున్నారు . అఫ్ కోర్స్ అల్లు అర్జున్ - మెగాస్టార్ మేనల్లుడు ..లీగల్ ఇష్యూస్ ఎదురుకోవాల్సి వస్తుంది అనే కారణంగానే మీటింగ్ కి  డుమ్మా కొట్టారా..? నో వే .


అసలు అలా చేయాలి అంటే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మీటింగ్లో పాల్గొన్నాడుగా . లీగల్ గా ఎటువంటి ఇష్యూస్ ఎదురుకోలేడు . మరి ఎందుకు రేవంత్ రెడ్డి మీటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనలేదు..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే ఈ మీటింగ్ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి ఫేవర్ చేయాలి అనే కోణంలోనే వెళ్ళింది . బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వాలి. అదేవిధంగా టికెట్ రేట్లు పెంచాలి అంటూ రిక్వెస్ట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి సినిమా సభ్యుల నిర్ణయించుకున్నారు.


అయితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్.. సినిమా రిలీజ్ కాబోతుంది . అదేవిధంగా చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . ఇప్పుడు సీఎంను కలిసే మీటింగ్లో చిరంజీవి వెళితే కచ్చితంగా ఆయన సినిమా కోసమే టికెట్లు పెంచుకునేలా చేసుకున్నాడు అన్న టాక్ బయటకు వస్తుంది . ఒకవేళ అది కూడా చూసి చూడనట్లు వదిలేసిన ఖచ్చితంగా అల్లు అర్జున్ ప్రస్తావన వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కారణంగా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. సారీ అన్న పదం చెప్పడం ఇష్టం లేకనే చిరంజీవి వెనక్కి తగ్గాడు అంటున్నారు జనాలు. అయితే చిరంజీవి "సారీ" అన్న పదాన్ని ఈజీగా చెప్పేస్తాడు . కానీ ఇక్కడ సారీ చాలా వాల్యుబుల్ . పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా వైసిపి కాండిడేట్ కి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడమే ఇప్పుడు ఈ "సారీ" అన్న పదాన్ని చిరంజీవి .. అల్లు అర్జున్ కోసం వాడ లేకుండా పోయే పరిస్థితి తీసుకొచ్చింది అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: