అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రివ్యూ.. కళ్యాణ్ రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!

frame అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రివ్యూ.. కళ్యాణ్ రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!

Reddy P Rajasekhar
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ భారీ స్థాయిలోనే ఉందనే సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఈ నెల 18వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాలో క్లైమాక్స్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాలేదని కళ్యాణ్ రామ్ ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చారు.
 
ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ కాగా సెన్సార్ టాక్ సైతం పాజిటివ్ గా ఉండటం గమనార్హం. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా 2 గంటల 24 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అదిరిపోయాయని కొన్ని సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తాయని తెలుస్తోంది.
 
ఈ సినిమా స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉందని తల్లీ కొడుకులైన విజయశాంతి కళ్యాణ్ రామ్ పాత్రలకు సంబంధించిన సన్నివేశాల మధ్య డ్రామా అద్భుతంగా పండిందని సెన్సార్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా సెకండాఫ్ లోని ప్రతి సీన్ న భూతో న భవిష్యత్ అనేలా ఉందని తెలుస్తోంది. క్లిష్టమైన సబ్జెక్ట్ ను సైతం ప్రదీప్ చిలుకూరి అలవోకగ డీల్ చేయగా అజనీష్ లోకనాథ్ బీజీఎంతో ఈ సినిమా స్థాయిని పెంచారని టాక్.
 
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు ఒకింత భారీ స్థాయిలో ఖర్చు కాగా సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ఆ ఖర్చు కనిపించేలా ఉందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హి సాధించడం పక్కా అని తెలుస్తోంది. బింబిసార సినిమాను మించిన కలెక్షన్లను ఈ మాస్ ఎమోషనల్ మూవీతో కళ్యాణ్ రామ్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: