మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో నయనతార, చిరంజీవి కి జోడిగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. షైన్ స్క్రీన్స్ , బ్లాక్ బాక్స్ బ్యానర్లపై సాహు గారపాటి , సుస్మిత కొణిదల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు బీమ్స్ సిసిరిలీయో సంగీతం అందించగా ... టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఈ మూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ బృందం వారు పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది.
తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యూ / ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా బృందం వారు ఈ మూవీ కి సంబంధించిన రన్ టైం ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 2 గంటల 42 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక 2 గంటల 242 నిమిషాల నిడివి అంటే తక్కువ ఏమీ కాదు. ఈ సినిమాలో చిరంజీవి , వెంకటేష్ నటించడం , ఈ మూవీ రన్ టైం కూడా ఎక్కువ ఉండడంతో చిరంజీవి , వెంకటేష్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బీభత్సంగా ఆకట్టుకుంటాయి అని చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.