రోడ్డున పడ్డ టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్?

praveen
టాలీవుడ్ పాన్ ఇండియా స్థాయిలో ఓ వెలుగు వెలుగుతుంటే టాలీవుడ్ హీరో రోడ్డున పడడం ఏమిటని అనుకుంటున్నారా? ఎక్కువ ఉహించుకోకండి.. విషయం పూర్తిగా చదివితే మీకే బోధ పడుతుంది. సాధారణంగా వెండితెర ఇలవేల్పులుగా, జనాల గుండెల్లో నీరాజనాలు అందుకుంటున్న హీరోలు సైతం నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడతారని మీలో ఎంతమందికి తెలుసు! వాళ్ళ రోజువారీ బిజీ లైఫ్ లో అప్పుడప్పుడు పబ్లిక్‌కు, మీడియాకు దూరంగా ఉండి... ప్రశాంత వాతావరణం గడపాలని ఆశిస్తూ ఉంటారు. కానీ చాలామందికి అది సాధ్యపడదు. అయితే కొంతమంది మాత్రం అలాంటి పరిస్థితులలో కూడా చాలా సింపుల్ గా ఉంటూ నచ్చిన విధంగా బతుకుతూ ఎదుటివారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తారు.
అలాంటివారిలో ఒకప్పటి హీరో, ఇప్పటి విలన్ అయినటువంటి జగపతిబాబు ఒకరు. ఆయన తన సినిమా జీవితంలో ఏ స్థాయికి వెళ్లారో చెప్పాల్సిన పనిలేదు. బేసిగ్గా జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ బడా నిర్మాత, దర్శకుడు కావడంతో జగపతి బాబు ఎంట్రీ చాలా ఈజీగా జరిగింది. కానీ ఆయన సినిమా పరిశ్రమలో నిలబడడానికి చాలా కసరత్తులు చేయవలసి వచ్చింది. అవును... నటుడిగా నిలదొక్కుకోవడానికి ఆయన ఎంతో కష్టపడటమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్ హీరోగా నిలిచారు. 90వ దశకంలో తన హవా చూపించిన జగపతి బాబు.. తర్వాత కొత్త హీరోల ఎంట్రీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు.
ఆ మధ్యలో అవకాశాలు లేకేపోవడం, వందల కోట్ల ఆస్తి కరిగిపోవడంతో ఆర్ధికంగా కూడా ఆయన చాలా ఇబ్బందిపడ్డారు. ఇలాంటి దశలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లెజెండ్‌లో విలన్‌గా అవతారమెత్తి ట్రెండ్ సెట్ చేశారు జగపతిబాబు. ఇపుడు ఆయన వేసిన బాటలో పలువురు సీనియర్ హీరోలు కూడా ప్రతినాయక పాత్రలు వేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. 60 ప్లస్‌లో కూడా చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్రాళ్లకి పోటీ ఇస్తున్నారు జగపతి బాబు. అభ్యుదయ భావాలున్న జగపతి బాబు సింపుల్‌గా ఉండటానికే ప్రాధాన్యతను ఇస్తారని మీలో ఎంతమందికి తెలుసు?
ఎల్లపుడు మీడియాకు, పబ్లిక్‌కు దూరంగా ఉండే ఆయన మైక్ అందుకున్నారంటే ఎవరినైనా, ఏ విషయంపై అయినా చాలా ఖరాఖండిగా మాట్లాడేస్తాడు. ఎవరు ఏమనుకున్నా సరే తను చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జగపతి బాబు ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. భీమవరం ఫుడ్ ఫెస్టివల్‌లో భాగంగా రోడ్డుపై ఉన్న వెరైటీలను జగపతి టేస్ట్ చేస్తూ వీడియోను షేర్ చేసారు. దానికి... ఈ మనిషి రోడ్డున పడ్డాడు అనే క్యాప్షన్ జోడించాడు. దాంతో ఈ వీడియో ఇపుడు టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: