తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఊహించని మలుపు తిప్పిన 2024 - కీలక సంఘటనలు ఇవే..!

Amruth kumar
2024 తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కీలక మలుపు తెప్పింది .. ప్రత్యర్థులను ఊహించని చిత్తు చేసి అధికారం అందుకున్న నేతలు .. హోరాహోరీ పొలిటికల్ వార్‌లో అనుకోని సంఘటనలు ఇలా ఈ 2024లో జరిగిన టాప్ పొలిటికల్ సెన్సేషన్ వార్తలు గురించి ఒకసారి ఇక్కడ చూద్దాం. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2024 సంవత్సరానికి హైలైట్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు .. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అఖండ విజయం సాధించిన వైసిపి .. కేవలం 11 సీట్లకే పరిమితం అవ్వటం ఎవరు ఊహించి ఉండరు .. సంక్షేమానికి పెద్దపీట వేసిన వైసిపి ప్రభుత్వం ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో డబ్బులు పంచింది. ఎక్కడో ఉన్న అసంతృప్తి ఓటు రూపంలో వైసీపీకి ఘోరమైన దెబ్బ కొట్టింది .. టిడిపి , జనసేన , బిజెపి కూటమి ఏర్పాటు చేసి వైసిపికి ఊహించని దెబ్బ కొట్టాయి .. 175 సీట్ల‌లో కూటమి పార్టీలు 164 సీట్లు గెలుచుకున్నాయి. జనసేన పార్టీ అయితే పోటీ చేసిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధించింది. చాలా సంవత్సరాలు తర్వాత టిడిపికి జాతీయ స్థాయిలో చక్రం తిప్పే ఛాన్స్ కూడా ఈ 2024 లోనే వచ్చింది .. ఎన్డీఏలో బిజెపి తర్వాత 16 ఎంపీలతో రెండో స్థానంలో కీలక భాగ్యస్వామిగా టిడిపి అవతరించింది.

2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ బిజెపికి అనూహ పలితాలు వచ్చాయి .. తెలంగాణలోని మొత్తం 17 లోక్ స‌భ స్థానాల్లో కాంగ్రెస్ 8, బిజెపి 8, ఎంఐఎం ఒకటి ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి . మూడు ఎంపీ స్థానాల నుంచి 8 ఎంపీ సీట్లకు బిజెపి తన బలాన్ని పెంచుకుంది .. ఊహించిని విధంగా బిఆర్ఎస్ కు ఒక ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది .. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కెసిఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత జరిగిన లోకసభ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవమే ఎదురయింది. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాత స్థానాన్నికి బిజెపి ఎగబాకింది. అయితే ఇప్పుడు బిఆర్ఎస్ ను తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను  కేటీఆర్ , హరీష్ రావు తీసుకున్నారు .. అధికార కాంగ్రెస్ పార్టీను ఇరుకున‌ పట్టేందుకు ప్రయత్నం  చేస్తున్నారు. ఊహించిని విధంగా పొలిటికల్ పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ఎదిగిన సంవత్సరం 2024 .. గత 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిన పవన్ జనసేన పార్టీ .. 2024 ఎన్నికల్లో అటు బిజెపి ఇటు టిడిపికి వారిదిగా నిలిచింది . ఆంధ్రప్రదేశ్లో కూటమి పొత్తుకు పవన్ కళ్యాణ్ కీలకంగా నిలిచారు. గత ఎన్నికలు 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానల‌లో ఘన విజయం సాధించింది .. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పోటీ చేసిన రెండు సీట్లు ఓడిపోయిన స్థాయి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం స్థాయికి చేరిన పవన్ కళ్యాణ్ కు 2024 సంవత్సరం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్ట్ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది .. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చు 15న ఈడి అరెస్టు చేసింది .. అనంతరం సిబిఐ సైతం కవితను అరెస్టు చేసింది సుమారు 165 రోజుల పాటు తీహార్‌ జైల్లో ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిలు ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరపరాజ్యం ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో బిఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఆగస్టులో జైలు నుంచి బయటకు వచ్చిన కవిత కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్గా మారుతున్నారు. వైయస్ షర్మిల తన రాజకీయాలను తెలంగాణ నుంచి ఏపీకి మార్చుకున్నారు.. వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మారారు .. తెలంగాణ నుంచి ఏపీ రాజకీయాల్లోకి వెళ్లిన ష‌ర్మిల ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. అయితే పోటీ చేసిన అన్ని స్థానాలు కాంగ్రెస్ ఓటమి పాలైంది చివరికి ఎంపీగా పోటీ చేసిన షర్మిలా సైతం ఓడిపోయారు..  ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు అందుకో లేకపోయినా  కొన్నిచోట్ల వైసిపి ఓటమికి కారణమైంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: