అల్లు అర్జున్‌ను ముంచేసిన ఆర్మీ... తెరవెనక కథ ..?
మెగా అభిమానులతో సంబంధం లేకుండా తనకంటూ సొంతంగా అల్లు ఆర్మీ పేరుతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. దీనికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా అల్లు అర్జున్ అండదండలు ఉన్నాయి. తనకంటూ అల్లు ఆర్మీ పేరిట కొంతమంది అభిమాన గణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ వస్తోంది. ఎప్పుడు అయితే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులను కాస్త వేరుగా చూస్తున్న ప్రవర్తన బన్నీలో కనిపించిందో వెంటనే అల్లు ఆర్మీ కూడా రెచ్చిపోతూ వచ్చింది. తమ హీరోగొప్ప అసలు పవన్ కళ్యాణ్ ..చిరంజీవితో సంబంధం లేకుండా తమ హీరో స్టార్ హీరో అయిపోయాడు అన్నట్టుగా అల్లు ఆర్మీ రెచ్చిపోయింది.
మరి చిరంజీవి అంత గొప్ప అయితే మా హీరో సినిమాకు 1700 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.. చిరంజీవి సినిమాలకు ఎందుకు రాలేదు ? పవన్ కళ్యాణ్ కు ఎందుకు హిట్ సినిమాలు రావడం లేదు అన్న ప్రశ్నలు కూడా అల్లు అర్జున్ నుంచి వచ్చాయి.. ఇవన్నీ చూసుకుని అల్లు అర్జున్ గాలిలో తేలిపోయారు.. ఆకాశంలోకి వెళ్లిపోయారు. ఫలితంగా తన ఇమేజ్ను బ్యాలెన్స్ చేసుకోవడంలో గతితప్పారు. చివరకు ఇలా చిక్కుల్లో పడ్డారు అన్న చర్చలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. అదే ఇలాంటి విషయాలలో ముందు నుంచే తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ అభిమానులను గతి తప్పకుండా ట్రాక్లో ఉండేలా చూసుకుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నా చర్చలు తెరమీదకు వస్తున్నాయి.