ఐకాన్ బాబులో ఇప్పటికైనా మార్పు వస్తుందా?

praveen
పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. వివాదం రోజురోజుకీ ముదరడంతో అర్ధం చేసుకున్న సినీ పెద్దలు ఒకవైపు ఆసుపత్రిలో ఉన్న చనిపోయిన రేవతి కుమారుడు శ్రీ తేజను పరామర్శించే పనిలో ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ నిర్మాతలు, హీరో, హీరోయిన్లు, దర్శకుడు సుకుమార్ కలిసి తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయిలను ప్రకటించడం జరిగింది. ఇంత చేసినా ఒకవైపు ఎన్ని కోట్లు ఇచ్చినా చనిపోయిన ప్రాణాన్ని అయితే తీసుకు రాలేరు కదా! అనేవారు లేకపోలేదు. ఇన్నింటి మధ్యలో కూడా సినీ పెద్దలు సమావేశమై ఈరోజు తెలంగాణ సీఎంని బుజ్జగించే పనిలో పడ్డారు. కానీ పెద్దగా ఉపయోగం లేనట్టు కనబడుతోంది.
ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏవైతే మాట్లాడారో అవే మాటలకు కట్టుబడి ఉన్నట్టు తేల్చి పారేసారు. కాగా తాజా సమావేశంలో రేవంత్ అల్లు అర్జున్ వ్యవహారం కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం ఎలాంటి సహకారం కోరుకుంటుందో రేవంత్ వారికి చాలా స్పష్టంగా వివరించినట్టు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం పరిశ్రమ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని.. పూర్తి నివేదిక తో కలవాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో సినీ రంగం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఆ సంగతి పక్కనపెడితే కాగా కొంతకాలంగా అల్లు అర్జున్ నడత విషయమై అనేక విమర్శలు వినబడుతున్నాయి. మరీ ముఖ్యంగా స్టైల్ స్టార్, ఐకాన్ స్టార్ గా రూపాంతరం చెందిననాటి నుండి అతని తీరులో ఏదో తెలియని సంభవించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా అల్లు అర్జున్ సినిమా వేదికల మీద ఏ విధంగా మాట్లాడుతాడో అందరికీ తెలిసిందే. అదేమాదిరి ఈ ఇష్యులో మొన్న ప్రెస్ మీట్ లో కూడా ఆ విధంగానే స్పందించి ఎన్నో విమర్శలకు తావిచ్చాడు. తన మామలు అయినటువంటి మెగాస్టార్, పవర్ స్టార్ మాదిరి... ఎదిగిన కొద్దీ ఎందుకు ఒదిగి ఉండలేదు! అనే అనుమానం చాలామంది మదిలో ఉండి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: