శ్రీవల్లి కడుపులో ఉన్నది అబ్బాయా..? అమ్మాయా..? ఫ్యాన్స్ కనిపెట్టేసారుగా..!

Thota Jaya Madhuri
పుష్ప2 సినిమా చూసిన తర్వాత జనాలకు రకరకాల డౌట్ వచ్చేసాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎవరు? సుకుమారా..? రాజమౌళి నా..? నెంబర్ వన్ హీరో ఎవరు బన్నీ నేనా..? లేక మిగతా పాన్  ఇండియా స్టార్ లా..? అంతేకాదు పుష్ప3 ఉంది అంటూ లాస్ట్ లో చూపిస్తారు .. అసలు పుష్ప3 సినిమా ఎప్పుడు తెరపైకి ఎక్కుతుంది..? తెరపైకి ఎక్కితే అసలు హీరో ఎవరు ..? బాంబ్ బ్లాస్ట్ లో పుష్ప ఫ్యామిలీ చనిపోతుందిగా ..? మరి పుష్ప3లో ఎవరిని హీరోగా చూపిస్తారు ..? 


పుష్ప3లో విలన్ సన్ని డియోల్ అంటూ ప్రచారం జరుగుతుంది.  అది నిజమేనా..?  బ్యాక్ లుక్ ఆధారంగా సన్ని డియోల్  పేరు బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఇప్పుడు కొంతమంది జనాలకి మరొక బిగ్ డౌట్ వచ్చింది . పుష్ప2 సినిమాలో శ్రీవల్లి ప్రెగ్నెంట్ గా చూపిస్తారు.  శ్రీవల్లి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కడుపులో ఉన్నది అమ్మాయి అయితే బాగుంటుంది అంటూ బన్నీ ఆశపడతారు. కానీ పుష్ప కోరిక నెరవేరడం లేదు అని పుష్ప భార్య శ్రీవల్లి కడుపులో ఉన్నది అబ్బాయే అని తన నాన్నగారే మళ్లీ ఆ ఇంటికి రాబోతున్నాడు అని అంటున్నారు . దానికి హింట్ కూడా సుకుమార్ ఇచ్చేసాడు అంటూ సినిమాలోని ఒక సీన్ హైలెట్ చేస్తున్నారు .


పుష్ప ని అసలు తమ తమ్ముడు గానే స్వీకరించని అన్నలు ఫైనల్లీ తమ బిడ్డని కాపాడడంతో పుష్ప రాజ్  కూడా మా ఇంటి వారసుడే అంటూ ఇంటికి వెళ్లి మరి పెళ్లి పత్రిక ఇస్తారు . పుష్పరాజ్  కూడా మొదట బాధపడిన ఆ తర్వాత పెళ్లికి వెళ్లి హంగామా చేస్తాడు . అయితే ఇదే మూమెంట్లో శ్రీవల్లి పెళ్లి కార్డు తీసుకొచ్చి తన తల్లి పేరుని అలాగే పుష్ప రాజ్ శ్రీ వల్లి పేరును కూడా రాశాడు అనే విధంగా చూపిస్తుంది . అంతేకాదు లాస్ట్ లో ఇంకొక పేరు కూడా రాసి ఉంటే బాగుండేది సామి అంటూ తన కడుపులోని బిడ్డని చూపిస్తూ.. పుష్ప తండ్రి పేరు చెబుతుంది . ఇక్కడే సుకుమార్ దొరికిపోయాడు అంటున్నారు జనాలు . అంటే కడుపులో ఉన్నది అబ్బాయేగా పుష్ప రాజ్ కి పుట్టబోయేది బాబేగా అంటూ పుష్ప3 ని రూల్ చేయబోయేది పుష్పరాజ్  కొడుకే అని  శ్రీవల్లి కడుపులో ఉన్నది అబ్బాయే అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు . మరి సుకుమార్ నిజంగానే ఆ ఉద్దేశంతోనే ఆ డైలాగ్ పెట్టాడా..? వేరే ఉద్దేశంతో పెట్టాడా..? తెలియాలి అంటే పుష్ప3 టైం వచ్చే వరకు ఆగాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: