బన్నీ వర్సెస్ విజయ్ దేవరకొండ.. తెరమీదికొచ్చిన కొత్తవార్?

praveen
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా పుష్ప-2 సినిమా విడుదల ఫీవర్ కనిపిస్తోంది. ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మోస్ట్ అవైటెడ్ మూవీ గా ఉన్న పుష్ప-2 ఇక ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో అని తెలుసుకునేందుకు సినీ విశ్లేషకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో 11500 స్క్రీన్ లలో ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇండియాలో 6500 తెరలపై ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

 ఇలా ఇండియన్ ఫిలిం హిస్టరీలో అత్యధిక స్క్రీన్ లలో విడుదలవుతున్న సినిమాగా పుష్ప-2 రికార్డును క్రియేట్ చేసింది అని చెప్పాలి. ఇక ఈ విడుదలకు ముందు 1000 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ చేసినట్లు ఒకటాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అయితే పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కిన మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా పార్ట్ 2 పుష్ప 2 అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇక ఈ సినిమాకు పార్ట్-3 కూడా ఉండబోతుంది అని ప్రేక్షకులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు.

 పుష్ప-3 దీ రాంపేజ్ పేరుతో ఇక ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు అన్న విషయం ఇటీవల  ఒక పోస్టర్ ద్వారా అందరికీ క్లారిటీ వచ్చింది. కాగా మూడవ పార్ట్ గురించి ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పుష్ప-3 లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించబోతున్నాడట. అది కూడా ఏకంగా పుష్ప రాజ్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన రాలేదు. కానీ ఇలా మూడవ పార్ట్ లో అల్లు అర్జున్ వర్సెస్ విజయ్ దేవరకొండ వార్ ఎలా ఉండబోతుందో చూడటానికి అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: