దేవర గాయం... గతం గతః .. ఎన్టీఆర్ ఫాన్స్ న్యూ బిగినింగ్ అప్డేట్..!
ఇక ఇప్పుడు పుష్ప2 అన్ని సందేహాలను తీర్చేసింది .. ఐదు గంటలకు పైగా ఎలాంటి ఆటంకాలు లేకుండా భాగ్యనగరం మధ్యలో యూసఫ్ గూడా అలాంటి ఓపెన్ గ్రౌండ్లో ఈవెంట్ చేయడం మిగిలిన వాళ్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది .. ఇక దేవర 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈవెంట్ పరంగా చెప్పుకోవడానికి చూపించడానికి ఏ జ్ఞాపకం లేకుండా పోయింది .. ఇక దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా దేవర నిర్మతగా ఉన్న కళ్యాణ్ రామ్ మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు .. ఇక పుష్ప 2కి సాధ్యమైంది మీ వల్ల ఎందుకు కాలేదంటూ ప్రశ్నిస్తున్నారు .. ఇక వారి ఆవేదనకు లాజిక్ ఉంది కానీ ఎవరైనా ఏం చేయగలరు ..
ఎన్టీఆర్ మళ్ళీ కనిపించేది వార్ 2 ప్రమోషన్ లోనే .. అదేమో వచ్చే సంవత్సరం ఆగస్టులో రిలీజ్ కానుంది .. అప్పటివరకు ఎదురుచూడాల్సిన పని .. త్రిబుల్ ఆర్ లాగా అది మల్టీస్టారర్ మూవీ కాబట్టి ఎన్టీఆర్ ఒక్కడికే క్రెడిట్ ఉండదు .. దేవర లాగా ఒక్కడినే చూడాలంటే మాత్రం ప్రశాంత్ నీల్ సినిమాతోనే అది కుదురుతుంది. ఇంత గ్యాప్ ఉంది కాబట్టే దేవరకి ఏదైనా గ్రాండ్ గా జరిగి ఉండాలని కోరుకున్నారు. సరే గతం గతః అనుకుని ఇకపై హైదరాబాద్ లో ఏ ఈవెంట్ అయినా చేసుకోవచ్చనే కాన్ఫిడెన్స్ పుష్ప 2 ఇచ్చేసింది కాబట్టి రాబోయే రోజుల్లో హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక వ్యూస్ పరంగా దేవర దూకుడు భారీగా ఉంది.