పుష్ప 2 మాత్రమే కాదు .. డిసెంబర్ అంతా మామూలు కాలేదుగా రచ్చరచ్చే..!

Amruth kumar
సంక్రాంతికి ఒక నెల ముందే డిసెంబర్లో ఈసారి కొత్త సినిమాల జాతర గట్టిగాా కనిపిస్తుంది .. డిసెంబర్లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు పెద్ద చిన్న మీడియం సినిమాలు వరుసగా వచ్చేస్తున్నాయి .. ఇక డిసెంబర్ మొదటి వారం  బాక్సాఫీస్ ను షేక్‌ చేయడానికి పుష్ప 2 తో వస్తున్నాడు అల్లు అర్జున్ .. పుష్ప2 రిలీజ్ తర్వాత మిగతా సినిమాలు క్రిస్మస్ సెలవుల్ని టార్గెట్గా చేసుకుని రానున్నాయి .. ఏకంగా ఆర‌డజనుకు పైగా సినిమాలు చివరి రెండు వారాల్లో రాబోతున్నాయి .. అల్లరి నరేష్ బచ్చల మల్లితో డిసెంబర్ 20న ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు .. ఇదొక రియల్ లైఫ్ స్టోరీ ... గమ్యం , నాంది సినిమాలలా తన కెరియర్ లో గుర్తుండే పోతుందని నమ్మకంగా చెబుతున్నాడు నరేష్ ..

అలాగే ప్రియదర్శి , మోహన్ కృష్ణ ఇంద్రగంటి సారంగపాణి జాతకం డిసెంబర్ 20నే వస్తుంది .. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది .. గతంలో వచ్చిన డార్లింగ్‌తో నిరాశపరిచాడు ప్రియదర్శి .. అలాగే దర్శకుడు ఇందిర గంటి గత సినిమాలు కూడా నిరాశపరిచాయి .. ఇద్దరికీ ఈ సినిమా ఎంతో కీల‌కంగా మారింది. అలాగే డిసెంబర్ 20న రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రాబోతున్నాయి .. సౌత్ మల్టీ టాలెంటెడ్ హీరో ఉపేంద్ర నటిస్తూ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ యు ఐ .. ఇది ఫాంటసీ సినిమా ఉపేంద్ర ఆలోచనలు కొత్తగా ఉంటాయి .. ఈ సినిమాలో ఆయన ఎలాంటి అంశాలను టచ్ చేశాడు అనేది అందరికీ ఆసక్తిగా మారింది .. డిసెంబర్ మూడు మరియు నాలుగో వారం నుంచి అసలైన వేదిక కానుందా .. ఓ డబ్బింగ్ సినిమాతో పాటు మంచి లవ్ స్టోరీలు ఆడియన్స్ను పలకరించడానికి రెడీ అయ్యాయా .. అంటే అవును అనే సమాధానం వస్తుంది . ఇక గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విడుదలకు సిక్వల్ గా వస్తున్న విడుదల పార్ట్-2 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానంది .. పార్ట్ వన్ కోలీవుడ్ లో మంచి విజయం సాధించింది కానీ తెలుగులో పెద్దగా ప్రేక్షకులకు ఎక్కలేదు .. ఇక పార్టీ 2 రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి ..

వీటన్నిటితో పాటు మహేష్ వాయుస్ ఇచ్చిన ముఫాసా, రాజెంద్రప్రసాద్ మనవరాలు తేజస్విని నటించిన ఎర్ర చీరా సినిమాలు కూడా డిసెంబర్ 20నే రాబోతున్నాయి .. ఇక అలాగే వీటితో పాటు యంగ్ హీరో నితిన్ దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న క్రైమ్ కామెడీ రాబిన్ హుడ్ .. భీష్మ తర్వాత నితిన్ , వెంకీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో అందరి దృష్టిని ఆకర్షించింది.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నితిన్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ సినిమా కూడా ఇదే .. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.. ఈ సినిమాతో నితిన్ ఈ సంవత్సరానికి మంచి ఫినిషింగ్ టెచ్‌ ఇస్తాడా లేదో చూడాలి.డిసెంబర్ 25న వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ అనే డబ్బింగ్ సినిమా కూడా తెలుగు లోకి వస్తోంది. తేరీకి రీమేక్ ఇది.అలాగే డిసెంబర్ 27న పతంగ్ అనే ఓ చిన్న సినిమా వస్తోంది.ఇప్పటి వరకు తెలుగులో చాలా స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. కాని గాలిపటాల స్పోర్ట్స్ డ్రామాతో ‘పతంగ్’ అనే సినిమా రాబోతుంది. ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి దర్శకత్వంలో ఈ పతంగ్ సినిమా తెరకెక్కుతుంది. మొత్తానికి ఈసారి సంక్రాంతి ముందే బాక్సాఫీసు దగ్గర పండగ కళ కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: