ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆర్య సినిమాతో అద్భుతమైన గుర్తింపును సాధించుకున్నాడు.అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప 2'. రష్మిక హీరోయిన్. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఇప్పటికే ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా పుష్పరాజ్ రాకకోసం ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 12 వేల కన్నా ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.ఇదిలావుండగా పుష్ప 2 ప్రమోషనల్ కంటెంట్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ముఖ్యంగా నిన్న హైదరాబాద్లో చేసిన ఈవెంట్ కూడా సూపర్ సక్సెస్. దీంతో ‘పుష్ప 2’ ప్రమోషన్ల హడావిడి ముగిసింది. సుకుమార్ కూడా 4 రోజుల క్రితమే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేశాడు. దాదాపు అన్ని ఏరియాలకు ప్రింట్లు అనుకున్న టైంకి వెళ్లిపోతున్నాయి.డిజిటల్ కాబట్టి అన్ని ఏరియాల్లో అప్లోడ్ చేసేస్తారు.పుష్ప విషయంలో పడ్డ టెన్షన్స్ ఈసారి టీం తీసుకోవడం లేదు. ముఖ్యంగా సుకుమార్.ఈ క్రమంలో నిన్న హైదరాబాద్, యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో చాలా కూల్ గా కనిపించాడు సుకుమార్.అయితే పుష్ప 2 విషయంలో నాట్ శాటిస్ఫైడ్ అని సుకుమార్ అన్నాడట. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు విదేశాలకు వెళ్తే టాలీవుడ్ అంటే బాహుబలి అనేవారు ఇప్పుడు పుష్ప అంటున్నారు అంటూ చెప్పుకొచ్చిన గోపీచంద్ మలినేని.పుష్ప 2 విషయంలో మేము చాలా హ్యాపీ అని సుకుమార్ గారి దగ్గర అంటే, ఐ యాం నాట్ శాటిస్ఫైడ్ అని ఆయన అన్నారు.సినిమా పట్ల ఆయన డెడికేషన్, ప్యాషన్ ఎలాంటిదో ఆ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు అంటూ ప్రశంసించాడు.