షాక్: ఆ పని చేయడంతో లేవలేకపోయా.. రకుల్ ప్రీతిసింగ్..హట్ కామెంట్స్..!

Divya
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ అక్టోబర్లో తన పుట్టినరోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో తాను వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లుగా అభిమానులకు తెలియజేసింది.. ఆ కారణంగానే ఆమె అప్పటినుంచి కేవలం బెడ్డుకే పరిమితమయ్యానని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది రకుల్ ప్రీతిసింగ్. కానీ దీపావళికి మాత్రం లేచి నడవడం మొదలు పెట్టానని అయితే ఇంకా పూర్తిగా కోలుకోలేదని అందుకు సంబంధించి చికిత్స కూడా కొనసాగుతున్నదంటూ తెలియజేసింది రకుల్ ప్రీతిసింగ్. ఆ చికిత్స వల్ల తాను రోజురోజుకీ కాస్త మెరుగు పడుతున్నానని తెలియజేసింది.

అలాగే ఆమె అలా అవడానికి ముఖ్య కారణం ఒక గాయమని వివరిస్తూ.. అక్టోబర్ 5 తాను 80 కేజీల డేట్ లిఫ్ట్ ని ఎత్తానని అప్పుడు తన వెన్నముక చాలా నొప్పిగా అనిపించిందని కానీ తాను తన వర్కౌట్ పూర్తి చేసిన తర్వాత ఇంటికి వెళ్లానని.. సాయంత్రానికి తాను వంగలేని విధంగా భయంకరమైన నొప్పి వచ్చిందని ఆ నొప్పి ఉన్నప్పటికీ కూడా తాను షూటింగ్లో పాల్గొన్నారు. అయితే ఐదు రోజులకి ఆ గాయంతో నొప్పి భయంకరంగా పెరిగిపోయిందని తన పుట్టినరోజు పార్టీకి సిద్ధమవుతున్న సమయంలో తన దిగువ శరీరంపై బాగా నుండి విడిపోయినట్టుగా అనిపించిందని వెల్లడించింది రకుల్ ప్రీతిసింగ్.

తన బ్లడ్ ప్రెషర్ కూడా పడిపోయిందని అందుకే తను తన పార్టీని చూడలేకపోయాను శారీరకంగా మాత్రమే ఉన్నానని విషయాన్ని తన భాగస్వామి అర్థం చేసుకున్నారని తెలిపింది. అయితే ఇది కేవలం 10 రోజులు మాత్రమే కాదు..ఇప్పటికీ కూడా తాను 100% ఫర్ఫెక్ట్ గా లేదని తెలియజేసింది.. ఒకానొక సమయంలో తాను బాగుంటానా పరిగెత్తి పరిగెత్తుతాన లేకపోతే తన పనులు తాను చేసుకుంటానా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయని తెలిపింది. తనకు ఇలాంటి గాయం నయం కావాలి అంటే 6 నుంచి 8 వారాలు పడుతుందట. ప్రస్తుతం తాను ఆరో వారంలో ఉంటూ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: