టీవీ: బిగ్ బాస్ నుంచి పృథ్వీ ఎలిమినేట్.. కళ్లు చెదిరే రెమ్యునరేషన్..!

Divya
బిగ్ బాస్ షోలో ఇటీవలే పృథ్వీరాజ్ ఎలిమినేట్  కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం విన్నర్ రేంజ్ లో అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కన్నడ నటుడు అయినప్పటికీ కూడా తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో అవకాశం రావడంతో ఎంట్రీ ఇచ్చిన పృథ్వీరాజ్ ఈవారం డబ్బులు ఎలిమినేషన్ కి బలహీనట్లుగా తెలుస్తోంది. అది కూడా అవినాష్ కోసం పృద్విని బలి చేసినట్లుగా సమాచారం. శనివారం రోజున టేస్టీ తేజ ని ఎలిమినేట్ చేయక ఆదివారం రోజున పృథ్విరాజ్ను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది.

పృద్వి ఎలిమినేట్ కావడంతో సోషల్ మీడియాలో కూడా బిగ్బాస్ హౌస్ టీం పైన కూడా కాస్త వ్యతిరేకత నమోదు అవుతున్నట్లు సమాచారం.. హౌస్ లో ప్రతి టాస్క్ ను కూడా ఎంతో చాకచక్యంగా ఆడే పృథ్వీరాజ్ అతని షార్ట్ టెంపర్ కారణంగా ఆటను పక్కనపెట్టి బలహీనతను సాకు చూపి తొక్కేయాలని ప్రయత్నం చేశారని వార్తలు అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఎంత ఆడినా కూడా లక్కు కూడా కలిసి రావాలని తెలియజేస్తున్నారు. 13 వారాలకు జెన్యూన్ క్యారెక్టర్ ను చూసి ఓట్లు వేసిన ఆడియన్స్ .. ఎన్నోసార్లు పృథ్విరాజ్ని సేఫ్ చేశారు.

హౌస్ లో ఒక్కసారి కూడా మెగా చీఫ్ కాలేకపోయారు పృథ్వీరాజ్.. శనివారం ఎపిసోడ్లో నిఖిల్, విష్ణు ప్రియ పృధ్విరాజ్ కు సైతం వెన్నుపోటు పొడిచినట్లుగా అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా విష్ణు ప్రియ విషయంలో కూడా డైరెక్ట్ గానే చెప్పేశారు పృద్వి.. ఓటింగ్ లో కూడా అవినాష్ కి తక్కువ రావడం జరిగింది టికెట్ టుఫినాలే రేసులో వెళ్లడంతో విన్ అవ్వడం తో ఎలిమినేట్ నుంచి అవినాష్ తప్పించుకున్నారు.. ఆ తర్వాత టేస్టీ తేజ వెళ్లడంతో అవినాష్ కాస్త సేఫ్ అయ్యారు.. కంచివరికి పృద్విని బలి చేశారు బిగ్ బాస్ టీమ్.. అయితే ప్రతి వారానికి రూ.2.5 లక్షల రూపాయలు అందుకున్నారట పృథ్వి 13 వారాలకు 32 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇది ప్రైజ్ మనకి దాదాపు దగ్గరగా ఉండే రెమ్యూనరేషన్ అని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: