నటి శోభితా సూసైడ్‌...గోవాలోని ఆ ఫోటోలే కారణం..వెలుగులోకి షాకింగ్‌ నిజాలు ?

Veldandi Saikiran

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. నటి శోభితా సూసైడ్‌ చేసుకుంది. గోవాలోని కొన్ని ఫోటోల కారణంగా నటి శోభితా సూసైడ్‌ చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కన్నడ సిరియల్ నటి శోభిత ఆత్మహత్య  మిస్టరీగా మారింది.  నటి శోభిత మృతి చెంది 24 గంటలు దాటిన ఇంకా సూసైడ్ గల కారణాలు ఇంకా బయటలకు రాలేదని అంటున్నారు.  శోభిత (32) ఆత్మహత్య గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలిసులు.

ఉన్నత స్థాయి అధికారులే... శోభిత (32) ఆత్మహత్య గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులు, నైబేర్స్, కుటుంబ సభ్యుల నుండి స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు  గచ్చిబౌలి పోలిసులు. నటి శోభిత ఆత్మహత్యకు ముందు ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడింది దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆత్మహత్య గల కారణాలు ఇప్పటి వరకు వెళ్లడించలేదు ఇరు కుటుంబ సభ్యులు. ఇక ఇటీవలే గోవా వెళ్లి వచ్చారట నటి శోభిత దంపతులు.
అటు గోవాలో దిగిన ఫోటోలు షేర్‌ చేయలేదట నటి శోభిత. ముఖ్యంగా సోషల్ మీడియాలో అక్టివ్ గా ఉండే శోభిత తన పెళ్లి ఫొటోస్ ఇప్పటి వరకు షేర్ చేయకపోవడంపై సస్పెన్స్ నెలకొంది.  భర్తతో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది శోభిత.  అయితే.. నిన్నటి రోజున ఇంట్లోనే ఫ్యాన్‌కు  ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది నటి శోభిత.
కన్నడలో పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందారు శోభిత. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు శోభిత భర్త సుధీర్. ఇక నటి శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.  అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. దీనిపై ఇవాళ సాయంత్రం లోగా వివరాలు చెబుతామని పోలీసులు అంటున్నారు. నటి శోభిత ఆత్మహత్య వెనుక భర్త కుట్ర ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: