ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు జానకిరామ్ భార్య కండిషన్స్.. అందుకే దూరమయ్యారా ?
యలమంచిలి గీత ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. రమేష్ అత్తిలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కూచిపూడి డ్యాన్సర్, వీణ రావు నటిస్తోంది. తాజాగా హీరో తారక రామారావును పరిచయం చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అందులో తారక రామారావు లాంగ్ హెయిర్ తో పాటు అతని బాడీనీ చాలా హ్యాండ్సమ్ గా చూపించారు. అదిరిపోయే బైక్ పై రైడ్ చేస్తున్న స్టిల్స్ ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా.... ఈ సినిమాకు సంబంధించి వైవిఎస్ చౌదరి మీడియా ముందు మాట్లాడారు. అతని మాటలను బట్టి తానే కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు దూరంగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఇక ఈ సినిమాకు తారక్, కళ్యాణ్ రామ్ మద్దతు ఉందా అని మీడియా ప్రశ్నించగా.... వైవిఎస్ చౌదరి సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. వారిద్దరి పేర్లు చెప్పడానికి కూడా చౌదరి ఆసక్తి చూపించడం లేదు.
పైగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు ఈ హీరోకి బంధువులు అన్నట్టుగా మాట్లాడారు. ఈ అబ్బాయికి తల్లి ఉంది కదా ముందుగా తల్లి అనుమతి చాలా అవసరం. ఆ తర్వాతే చుట్టాలు అంటూ వైవిఎస్ చౌదరి సమాధానమిచ్చారు. నందమూరి జానకిరామ్ భార్య తనకి కొన్ని కండిషన్లు పెట్టారని వాటి ప్రకారమే తాను నడుచుకుంటున్నానని చౌదరి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం చౌదరి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.