మండలిలో కూడా వైసీపీ ఖాళీ...టైటానిక్ షిప్ మునుగబోతుంది ?

Veldandi Saikiran
2019 అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 21 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ అనంతరం రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. అటు అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2020, 2022, 2024 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో కలిపి మొత్తం 11 స్థానాలని ఒక కైవసం చేసుకుంది. అయితే వైసీపీకి వచ్చే రాజ్యసభకు ఎన్నికైన బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ర్యాగ కృష్ణయ్య వేరువేరు కారణాలతో ఇటీవల వారి పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో ఏపీ కోటాలో మూడు ఖాళీలు ఏర్పడ్డాయి.

ఈ ఖాళీలకు డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.ఆ మేరకు ఇప్పటికే నోటిఫికేషన్ ను జారీ చేశారు. ఒక రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే ప్రస్తుతం వైసీపీ బలం 11 మాత్రమే. దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచే అవకాశాలు లేవు. అందువల్ల ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న మూడు స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఫిక్స్ అయినట్టే. ఈ ఉప ఎన్నిక ద్వారా పెద్దల సభలలోకి మళ్లీ తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇవ్వనుంది. జనసేనకు ఏపీ అసెంబ్లీ మండలితో పాటు లోక్ సభలో కూడా ప్రాతినిధ్యం ఉంది.

రాజ్యసభలో కూడా ఆ పార్టీ అడుగు పెడితే మొత్తం సభలలో జనసేన ఖాతా తెరిచినట్టు అవుతుంది. వాస్తవానికి 2026 వరకు ఏపీ కోటాలో రాజ్యసభకు ఎన్నికలు లేవు. అయితే అనూహ్యంగా వైసిపి నుండి ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం కూటమికి కలిసి వచ్చింది. అయితే అనుకోకుండా వచ్చిన ఈ మూడు స్థానాలను టిడిపి తీసుకుంటుందా లేక భాగస్వామ్యపక్షాలైన బిజెపి, జనసేనకు కూడా అవకాశం ఇస్తుందా అనేదా దానిపైన చర్చ జరుగుతోంది. రాజ్యసభలోనే కాదు ఏపీ మండలిలోను వైసీపీ సభ్యుల రాజీనామాలను కూటమికి కలిసి వస్తున్నాయి.

వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసిపికి శాసనమండలిలో మాత్రమే పట్టు ఉంది. మండలిలో టిడిపికి 10 మంది ఎమ్మెల్సీలు ఉంటే వైసీపీకి 37 మంది ఉన్నారు. దాంతో శాసనసభలో సంఖ్యాబలం లేకుండా పెద్దల సభలో పట్టు నిలుపుకుందామని భావించింది వైసీపీ పార్టీ. అయితే వరస రాజీనామాలు ఆ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. డొక్కా మాణిక్య వరప్రసాద్, వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్య ఎన్నికలకు ముందే రాజీనామాలు చేయగా, ఎన్నికల అనంతరం కర్రీ పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, జయ మంగళ వెంకటరమణ, పోతుల సునీత రిజైన్ చేశారు. మరికొందరు వైసిపి ఎమ్మెల్సీలు కూడా త్వరలోనే రాజీనామాలు చేస్తారని సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: