మహా ట్విస్ట్..! సీఎంగా ఎవరూ ఊహించని వ్యక్తి? బీజేపీ ప్లాన్ మామూలుగా లేదు?

Chakravarthi Kalyan

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు దాటి పోయాయి. ఇంకా కొత్త ప్రభుత్వం కొలువు తీరలేదు.  మహారాష్ట్ర రాజకీయం మాత్రం అలాగే కొనసాగుతోంది.  మెజారిటీని అప్పగించిన ప్రజలు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడం పట్ల విస్తుపోతున్నారు.  అయితే ఆ అధిక మెజారిటీయే ఇపుడు ప్రభుత్వం ఏర్పాటుకు ఇబ్బందిగా మారుతోంది అని అంటున్నారు.  ఏక్ నాధ్ షిండే తనకే సీఎం కావాలని అంటున్నారు.


ఢిల్లీలో బీజేపీ పెద్దలు నచ్చచెప్పినా ఆయన మాత్రం పట్టు వీడలేదు. మరో వైపు చూస్తే నిన్నటి దాకా బీజేపీ సీఎం అభ్యర్థికి మద్దతు ఇచ్చిన ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కూడా తనకూ సీఎం కావాలని ఉందని కోరికను బయటపెడుతున్నారు. దాంతో చిక్కు ముడి వీడడం కష్టంగా ఉంది.  ఈ నేపథ్యంలో మరాఠా వారే కొత్త సీఎం కావాలని నినాదం ఊపందుకుంటోంది. బీజేపీని విజయ బాటన గెలిపించిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనను వద్దు అంటున్న వారూ బీజేపీలోనూ కనిపిస్తున్నారు.


దీంతో మధ్యేమార్గంగా కేంద్రంలో విదేశాంగ శాఖ సహాయమంత్రిగా ఉన్న పూణేకు చెందిన ఎంపీ మురళీధర్ మొహోల్ కి సీఎం చాన్స్ జాక్ పాట్ లా తగలనుంది అని అంటున్నారు. ఆయన మరాఠా నేతగా ఉన్నారు. అంతే కాదు బలమైన ఆరెస్సెస్ నేత కాబట్టి పూర్తి స్థాయి మద్దతు ఆయనకు దక్కుతోంది.


ఇక ఫడ్నవీస్ సీఎం అయితే ఒప్పుకోని మిత్రులు ఏక్ నాధ్ షిండే, అజిత్ పవార్ లు కొత్త వారు అయిన మురళీధర్ మోహోల్ కి మద్దతు ఇస్తారని కూడా బీజేపీ ఆశిస్తోంది. ఇక మరాఠా నినాదంతో తమ పార్టీలను రాజకీయాలను బలంగా నడుపుతున్న శివసేన ఉద్ధవ్ థాక్రే అలాగే శరద్ పవార్ ఎన్సీపీలకు మరోసారి చాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే మరాఠా నేతకే సీఎం పదవి ఇవ్వడమే సరైన వ్యూహం అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారుట.


అవసరమైతే ఫడ్నవీస్ ని కేంద్రంలోకి తీసుకుని కీలకమైన శాఖలతో కేబినెట్ మంత్రిగా చేస్తారు అంటున్నారు. మొత్తానికి యూపీలో మధ్యప్రదేశ్, ఒడిషాలో అనుసరించిన విధానంలోనే ఇక్కడా అనుసరించి సక్సెస్ కావాలని బీజేపీ చూస్తోంది. ఏది ఏమైనా సీఎం అభ్యర్ధి ఎవరో తేల్చకుండానే డిసెంబర్ 5న ప్రమాణం అన్నది మాత్రం ప్రకటించారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: