ఓటమి పాఠాలు నేర్వని జగన్? ప్రజలదే తప్పు అంట?

Chakravarthi Kalyan

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అయితే అతి విశ్వాసంతోనా లేక తనదైన ఆలోచనలతోనా ఏమో తెలియదు కానీ 2024లో వచ్చిన దారుణమైన ఫలితాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవడానికి నిరాకరిస్తున్నారు అనే అంటున్నారు.  నూటికి 95 శాతం పైగా నియోజకవర్గాలలో వైసీపీ ఓటమి పాలు అయింది.


ఈ నేపథ్యంలో ఎక్కడ పొరపాటు జరిగింది అన్నది పార్టీ అధినాయకత్వం పరిశీలించాలి. ఆత్మ విమర్శ చేసుకోవాలి.  కానీ వైసీపీ అధినాయకత్వం తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందని అంటున్నారు. జగన్ అయితే 2024 ఎన్నికల ఫలితాల మీద భిన్నంగా వివిధ సందర్భాలలో స్పందిస్తున్నారు అని అంటున్నారు.  ఎన్నికల్లో ఓటమి తరువాత ఈవీఎంల మీద గతంలో వైసీపీ హై కమాండ్ విమర్శలు చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు.


తాడేపల్లిలో పార్టీ క్యాడర్ సమావేశంలో జగన్ మాట్లాడుతూ తనలోని అతి మంచితనం అతి నిజాయతీ వల్లనే ఎన్నికల్లో ఓటమి పాలు కావాల్సి వచ్చిందని ప్రకటించారు.  కొంతమంది ప్రజలు తన వద్దకు వచ్చి ఇదే విషయం చెప్పారని జగన్ ఈ సమావేశంలో చెప్పారు.  తాను ప్రతీ సంక్షేమ పథకాన్ని బటన్ నొక్కి ప్రజలకు చాలా సులువుగా చేరవేశాను అని ఆయన అన్నారు దానిని చూసిన తరువాత ఎవరైనా ఈ విధంగా చేయగలరని ప్రజలు భావించారు అని జగన్ అన్నారు.


పైగా చంద్రబాబు తన కంటే ఎక్కువ హామీలు ఇచ్చారు కాబట్టి ఆయన వైపు మొగ్గారని కూడా ఆయన చెబుతున్నారు. ఇలా తన అతి మంచితనం నిజాయతీ వల్లనే ఓటమి పాలు కావాల్సి వచ్చిందని జగన్ అంటున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అన్నది వైసీపీ హై కమాండ్ కూడా బేరీజు వేసుకుందా అన్నది మరో చర్చగా ఉంది.  



అయితే వీటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన వైసీపీ మాత్రం జనాలదే తప్పు అన్నట్లుగా ఆలోచిస్తోంది అని అంటున్నారు. పైగా టీడీపీ కూటమి హామీల వల్ల వారు అటు వైపు వెళ్లారు అని సర్దిచెప్పుకుంటోంది. అంతే కాదు జగన్ అయితే తన అతి మంచితనం, అతి నిజాయితి మళ్లీ సీఎంగా చేస్తాయని అంటున్నారు.


అసలు వైసీపీని ఎందుకు జనాలు తిరస్కరించారు అన్న వాస్తవాలను అంగీకరించడానికి ఆయన నిరాకరిస్తున్నారని అంటున్నారు.  మరి ఈ విధంగా చూస్తే కనుక జగన్ ఈ భ్రమలో ఎంత కాలం ఉంటే అంతలా నష్టం వైసీపీకి జరుగుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: