పుష్ప -2: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పీలింగ్స్ సాంగ్ వచ్చేసిందిగా.. ఎలా ఉందంటే..?
ముఖ్యంగా ఈ సినిమాలో స్టెప్పులు కూడా అదిరిపోయేలా ఉన్నాయని రష్మిక, అల్లు అర్జున్ మధ్య వచ్చే పాటలలోని స్టెప్స్ హైలెట్గా నిలుస్తున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఈ చిత్రానికి పనిచేసినట్లు తెలుస్తోంది. డాన్సుల విషయంలో అటు రష్మిక ,అల్లు అర్జున్ ఒకరికొకరు పోటీపడి మరీ చేసినట్లుగా కనిపిస్తోంది. నవంబర్ 27న కొచ్చి ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ మలయాళం ప్రేక్షకులకు కూడా ఒక సడన్ సర్ప్రైజ్ ఉంటుందంటూ తెలియజేశారు.ఇందులో భాగంగానే మలయాళ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ ని అన్ని భాషలలో ఉంటుందంటూ తెలియజేశారు.
ఫీలింగ్స్ సాంగ్ మలయాళ లిరీక్స్ తోనే మొదలవుతుంది.. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ పాట కూడా అభిమానులను తెగ ఆకట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. యూట్యూబ్లో కూడా పలు రకాల రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ పాట. అంతేకాకుండా ఎక్కడ చూసినా ప్రస్తుతం పుష్ప సినిమా మేనియానే ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే పుష్ప-2 నుంచి విడుదలైన తో పాటు సూసైకి అగ్గి రవ్వ అనే పాట కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పుష్ప-2 నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ కూడా అంతే రేంజ్ లో ఆకట్టుకుంది. మరి సినిమా ఏ విధంగా ప్రేక్షకులను అభిమానులను అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి.