ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సులువైన మార్గంగా మారిన కాకినాడ పోర్టులో నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాకినాడ పోర్టులోకి వివిధ కారణాలతో తనను రానివ్వకుండా రెండు నెలలు అధికారులే అడ్డుకున్నారని, చివరికి పోర్టులోకి వచ్చినా షిప్ లోకి ఎక్కనివ్వకుండా సాకులు చెప్పారని పవన్ చేసిన ఆరోపణలు, కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే మౌనాన్ని ప్రశ్నించిన తీరు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు భారీ ముప్పు పొంచి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్రం నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు వాటిల్లడానికి కారణాలు ఇలా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ కావడం. అలాగే గతంలో ఎంతో మంది రేప్ కేసులు, మర్డర్ కేసులు ఛేదించడానికి పవన్ కళ్యాణ్ కారణం కావడం. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అసభ్యకర పోస్టులు పెట్టి, రెచ్చిపోయిన వారి ఆట కట్టించడం, వారి పై కేసులు పెట్టించడానికి కారణం పవన్ కళ్యాణ్ కావడం. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారకుడు అయ్యి, జాతీయ స్థాయి నాయకులుగా పేరు ప్రఖ్యాతలు పవన్ కళ్యాణ్ కు రావడం. ఇటువంటి తరుణంలో ఏ మూల నుంచి అయినా ఏ క్షణం ఆయన ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని ఒక్క నిఘా వర్గాలు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా గ్రహించి చెప్పుకోవడం కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్త చర్చకు దారి తీసిందని పలువురు అంటున్నారు.ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోలేని సమస్యలకు అడ్డుకట్ట వేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తోందని యుద్ధ ప్రాతిపదికన జెడ్ ప్లస్ గాని, ఇంకా అవసరమైన సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏపీ రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.