పుష్ప -2 ఒక్క టికెట్ ధర రూ.3 వేలు.. ఎక్కడంటే..?

MADDIBOINA AJAY KUMAR
ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ కొడుతూ ప్రేక్షకుల మనసును దోచుకుంటున్నారు. స్టార్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న  ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే పార్ట్ వన్ హిట్ కొట్టడంతో ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమాను తీసినట్టు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.
తెలంగాణాలో సినిమా టిక్కెట్ల ధరలు పెరిగాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం సినిమా కోసం ఎక్కువ ధరలను వసూలు చేయడానికి థియేటర్లను అనుమతించింది. తెలంగాణ రాష్ట్రంలో పుష్ప 2 టికెట్ ధరలను రూ. 800 వరకు పెంచినట్లు సమాచారం. దీనివల్ల సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు పెంచుతుందని భావిస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా పుష్ప 2 టిక్కెట్ ధరలు పెరిగాయి. కొన్ని చోట్ల అయితే టిక్కెట్ ధరను రూ. 3,000 వరకు పెంచింది. అందులో ముంబై జియో వరల్డ్ డ్రైవ్ లోని PVR లో ఒక్కో టికెట్ కు ఏకంగా రూ. 3000 ఉండడంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అయినప్పటికీ టిక్కెట్ల కొనుగోలు మాత్రం ఆగడంలేదు.
దీంతో నెటిజన్లు పుష్ప 2 క్రేజ్ గురించి ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. పుష్ప 2 టిక్కెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని థియేటర్ల యాజమాన్యాలు స్వాగతిస్తున్నాయి. సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. పెరిగిన టిక్కెట్ ధరలు మా వసూళ్లను మరింతగా పెంచేందుకు దోహదపడతాయని తెలిపారు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక ప్రమోషన్లలో భాగంగా పుష్ప వైల్డ్ ఫైర్ జాతర అనే పేరుతో హైదరాబాద్ లోని యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రేపు సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: