సెలబ్రిటీలకు టోకరా.. సస్టెయిన్ కార్ట్ అధినేత అరెస్ట్..!

Divya
పెట్టుబడుల పేరుతో సెలబ్రిటీలను బోల్తా కొట్టించారు సస్టెయిన్ కార్ట్, తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.  సస్టెయిన్ కార్ట్ పేరుతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సెలబ్రిటీలకు కుచ్చుటోపి పెట్టిన ఇతడి పై తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.  పరినీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ గా ఉందంటూ తన కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి,  కోట్లాది రూపాయలను వసూలు చేసి తనను మోసం చేశాడని యువ మహిళా వ్యాపార వేత్త శ్రీజా రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది..
ముఖ్యంగా సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పా రెడ్డి కూడా ఇతని బాధితులుగా ఉన్నట్లుగా సమాచారం.  ముఖ్యంగా విచారణలో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇకపోతే పరిణీతి చోప్రాకు తన వ్యాపారంలో షేర్ ఉంది అంటూ బాలీవుడ్ హీరోయిన్ ని కూడా బురిడీ కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా దాదాపు రూ.1000 కోట్లకు పైగా మోసం చేసినట్లు కాంతి దత్  పై ఆరోపణలు వెలువడ్డాయి. ముఖ్యంగా పలువురు ప్రముఖుల సంతకాలను ఫోర్జరీ చేసే మోసం చేసినట్లు కూడా కాంతి దత్ పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
గతంలో కూడా ఇతనిపై సి. సి. ఎస్ లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇకపోతే హీరోయిన్లను పెట్టుబడుల పేరుతో మోసం చేయడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి వాళ్లను ఎలా నమ్ముతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.  ఏది ఏమైనా డబ్బు వ్యామోహంలో ఎలాంటి పనులైనా చేస్తారని మరికొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే సెలబ్రిటీలను ,వ్యాపారవేత్తలను డబ్బున్న వాళ్ళను ఎరగా వేసుకొని డబ్బు సంపాదిస్తున్న కాంతి దత్ పై కేసు నమోదవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: