ఓరి నాయనో.. అస్తిపంజరమే గిటార్.. ఇంతకీ అది ఎవరిదంటే?
"20 సంవత్సరాల తర్వాత, అతని శవాన్ని మా కుటుంబం స్మశానవాటికలోని ఒక చెక్క పెట్టెలో ఉంచింది దానికి కాస్త అద్దె కూడా చెల్లించింది. గ్రీస్‌లో ఇది పెద్ద సమస్య, ఎందుకంటే ఆర్థడాక్స్ మతం శవదహనాన్ని అనుమతించదు." అని మిడ్నైట్ ప్రిన్స్ మీడియాకు తెలిపారు. ఇక అస్తిపంజరాన్ని ఏం చేయాలో తెలియక ప్రిన్స్ తికమక పడ్డాడు. చివరికి తన మామ అస్థిపంజరం తో ఒక గిటార్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన మామకు సాంప్రదాయకంగా అంత్యక్రియలు చేయడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఈ వినూతన నిర్ణయం తీసుకున్నాడు.
అంతేకాకుండా, తన మామను ఎప్పటికీ గుర్తుంచుకోవడానికి ఇది మరో మార్గమని భావించాడు. ఆయన తన మామయ్య అస్థిపంజరాన్ని గ్రీస్ నుంచి అమెరికాకు తీసుకువచ్చాడు. తర్వాత స్థానిక ఫ్యూనరల్ హోమ్ సహాయంతో ఆ అస్థిపంజరాన్ని గిటార్‌గా మార్చడానికి అవసరమైన పనులు చేయించుకున్నాడు. అస్థిపంజరం నుంచి గిటార్ తయారు చేయడం చాలా కష్టమైన పని. ప్రిన్స్ అస్థిపంజరం వెన్నుముక భాగానికి ఒక మెటల్ రాడ్‌ను జోడించి గిటార్ నెక్‌గా మార్చాడు. అలాగే గిటార్ మంచి శబ్దాన్ని క్రియేట్ చేయడానికి నెక్, బ్రిడ్జ్‌ను సరిగ్గా అమర్చాడు. ఒక హిప్ బోన్లో వైర్ జాక్‌ను అమర్చి గిటార్‌ను పూర్తి చేశాడు.
ప్రిన్స్ తన మామ అస్థిపంజరంతో గిటార్ చేస్తానని చెప్పినప్పుడు ఆయన కుటుంబం, స్నేహితులు ఆశ్చర్యపోయారట. "నా అమ్మ ఇది పవిత్రమైన పని కాదని, దెయ్యాల పని అని అనుకుంది. కానీ నేను ఆమెతో, 'అంకుల్ ఫిలిప్ అతిపెద్ద హెవీ మెటల్ ప్రేమికుడు. అతను భూమిలో ఉండాలని కోరుకుంటాడా లేదా గిటార్ వాయించాలని కోరుకుంటాడా?' అని అడిగాను" అని చెప్పాడు. ప్రిన్స్ తయారు చేసిన ఈ గిటార్‌కు "స్కెలెకాస్టర్" అని పేరు పెట్టారు. ఇది తన మామకు చేసిన ప్రత్యేకమైన నివాళిగా మారింది. తాను ఈ గిటార్‌ని వాయించే వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలలో గిటార్ ప్రత్యేకమైన రూపం, శబ్దం కనిపిస్తాయి.