స్టార్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన .. ఏకైక తెలుగు సీరియల్ ఇదే..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడం ఒక ఎత్తు అయితే .. ఇక్కడ నిలదొక్కుకోవడం మరో ఎత్తు  .. యంగ్ హీరోలు ఎంతో మంది చిత్ర పరిశ్రమలోకి వస్తున్నారు టాలెంట్ ఉన్న అదృష్టం లేక కొన్ని సినిమాలకే కనుమరుగైపోతున్నారు .. టాలెంట్ లాక్ కలిసి వచ్చిన వారు అవకాశాలని వినియోగించుకుని స్టార్స్ గా ఎదుగుతున్నారు .. అలాంటి వారిలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు . నెలకు నాలుగు లక్షల జీతాన్ని వదులుకొని హీరో అవ్వాలనుకున్న ఆశతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు నవీన్ .. రెండు మూడు సినిమాలకే యూత్లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్నారు .. నవీన్ హైదరాబాదులో ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ యంగ్ హీరో ఎన్ఐటి భోపాల్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి లండన్ లో నాలుగు లక్షల ఉద్యోగం చేసేవాడు .. సినిమాల మీద ప్రేమ అతన్ని ఉద్యోగం చేసుకోనివ్వలేదు జాబ్ చేస్తున్న మనసంతా సినిమాల మీద ఉండేది .. దాంతో ఏం ఆలోచించకుండా ఉద్యోగం వదిలేసి హీరో అవ్వాలని ఉద్దేశంతో ఇండియాకి తిరిగి వచ్చేసాడు .. సినిమాల్లో అవకాశాలు రావడం అంత ఈజీ కాదు .. అంత పెద్ద జాబ్ లగ్జరీ లైఫ్ వదిలి పెట్టి తనకు నచ్చిన సినిమాల కోసం కాళ్లు అరిగిపోయేలా  తిరిగాడు నవీన్.

అయితే అందరిలా కాకుండా ఈ యంగ్ హీరోకు అదృష్టం కాస్త తొందరగానే వచ్చింది .. అవకాశాలు వెంటవెంటనే ఇతన్ని తలుపుదట్టాయి .. అవి కూడా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపంలో టాలీవుడ్ లో కొత్త ముఖాలను ఇండస్ట్రీకి పరిచయం చేసే దర్శకుడు ఎవరంటే వెంటనే శేఖర్ కమలా పేరే వినిపిస్తుంది.. కొత్త టాలెంట్ ని వెతికి మరి ఇండస్ట్రీకి పరిచయం చేయటం శేఖర్ కమ్ములకు అలవాటు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కోసం ఎప్పటిలాగానే కొత్తవారికోసం వెతుకుతున్న శేఖర్  కమ్ములా ఓ ఆడిషన్ పెట్టారు ఆ ఆడిషన్ లో నవీన్ పోలిశెట్టి పాల్గొనడం.. అతని నటన నచ్చి శేఖర్ కమ్ముల అవకాశం ఇవ్వడం జరిగిపోయింది.  ఈ సినిమాతో నటుడిగా నవీన్ పోలిశెట్టి కి మంచి పేరు వచ్చింది. ఇక ఆతరువాత మనోడు అవకాశాలు అందిపుచ్చుకోవడం స్టార్ట్ చేశాడు. బాలీవుడ్ లో ఓ షోకి యాంకర్ గా సెలక్ట్ అయ్యాడు.

అక్కడే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పరిచయం  స్నేహం కూడా ఏర్పడింది నీవీన్ కు. ఇటు తెలుగులో క్యారెక్టర్ రోల్స్.. అటు బాలీవుడ్ అవకాశాలు.. అలా బిజీ అయిపోయాడు నవీన్ పోలిశెట్టి.  ఇక నవీన్ నటించిన 24 వెబ్ సిరీస్ తెలుగులో సీరియల్ గా ప్రసారం అయ్యింది. జీ తెలుగులో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ కు పెద్దగా ఆదరణ లభించలేదు. హిందీ వెబ్ సిరీస్ ను తెలుగులో డబ్ చేసి ప్లే చేయడం.. మన ఆడియన్స్ కు అది పెద్దగా రీచ్ అవ్వలేదు. ఇలా నవీన్ పోలిశెట్టి తన కేరీర్ నటించిన ఒక్కేక సీరియల్ గా ఇది మిగిలిపోయింది. తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో మంచి హిట్ అందుకొని హీరోగా ఎదిగాడు .. జాతి రత్నాలు సినిమాతో స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక గత సంవత్సరం స్టార్ హీరోయిన్ అనుష్కతో మిస్శెట్టి మిస్ పోలిశెట్టి సినిమాలో నటించి మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు నవీన్ పోలిశెట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: