రూ.100 కోట్ల మోసం.. లిస్టులో సమంత, కీర్తి సురేష్..?

Veldandi Saikiran
తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ పైన తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ శ్రీజ రెడ్డి అనే మహిళ వ్యాపారవేత్త పెట్టుబడులో పెట్టించినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఆమె మోసపోయానని గ్రహించి తాజాగా కాంతి దత్ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అలాగే ఇతను పరిణీతి చోప్రాను కూడా వ్యాపారంలో షేర్ ఇస్తానంటూ మోసం చేశాడంటూ ఆరోపిస్తున్నారు.

ఫోర్జరీ సంతకాలతో పాటు పలువురు వ్యాపారవేత్తలను మోసం చేసి కోట్లలో డబ్బులు వసూలు చేశాడని అభియోగాలు కూడా వచ్చాయి. ఇతను గతంలో సస్టెయిన్ కార్ట్ అనే సంస్థను స్థాపించి సమంత, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి, కీర్తి సురేష్ లతో కూడా పెట్టుబడులను పెట్టించాడు. ఆ సంస్థతో కూడా వీరిని కూడా మోసం చేశాడని టాక్ వినిపిస్తోంది. గతంలోనే దీనిపై అనేక రకాలుగా వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ ఫేక్ అని అన్నారు.

ఇటీవల అతను ఎవరిని మోసం చేయలేదని, అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసుకున్నాడు. కాంతి దత్ మోసం చేసిన వారి లిస్ట్ లో కీర్తి సురేష్, పరిణితి చోప్రా, సమంత, డిజైనర్ శిల్పారెడ్డితో పాటు పలువురు హీరోయిన్లు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతను దాదాపు 100 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు సమాచారం అందుతుంది.

సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో కూడా కాంతి దత్ పైన కేసులు నమోదు అయ్యాయి. ఇక కాంతి దత్ బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు కూడా చెబుతున్నారు. శ్రీజ రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదుతో పోలీసులు కాంతిని అరెస్టు చేసినట్లుగా వార్తలు అందుతున్నాయి. దీనిపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: