లిప్ లాక్ లతో సినిమాలను వద్దనుకుంది .. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ .. ఎవరంటే..?

Amruth kumar
చిత్రపరిశ్రమ లో ఒక హీరోయిన్ మొదటి సినిమా తో తిరిగులెని స్టార్ డంను సంపాదించుకుంది కెరియర్ మొదట్లో ముద్దు సిన్లు కారణంగా చాలా సినిమాల అవకాశాలను వదులుకుంది ఈ ముద్దుగుమ్మ  .. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్టు గా ఆ తర్వాత బుల్లితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఇప్పుడు తెలుగు తో పాటు హిందీ లోనూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది .. ఇంత‌కి  ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు మృణాల్ ఠాకూర్  ..

 
ప‌లు సీరియల్స్‌ తో హిందీ బుల్లితెరకు పరిచయమైంది మృణాల్.. ఆ తర్వాత అర్జున్, కుంకుమ భాగ్యం అనే సీరియల్ తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సినిమాల్లో మృణాల్ ఠాకూర్  అడుగు పెట్టే సమయాని కి ఆమె వయసు 20 సంవత్సరాలు మ‌త్ర‌మే 2014 లో వరుసగా మూడు మరాఠి సినిమాల్లో నటించింది మృణాల్ .. అయితే 2018 లో వచ్చిన లవ్ సోనియా సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇదే ఆమె మొదటి హిందీ సినిమా కాగా ఇందులో డీ గ్లామర్ పాత్రలో నటించిన మృణాల్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది .. ఆ తర్వాత సూపర్ 30 ,  లస్ట్ స్టోరీస్ 2 , జెర్సీ వంటి సూపర్ హిట్ సినిమాల లో కూడా నటించింది .

ఇక మృణాల కెరియర్ మొదట్లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు  దాంతో పలు సినిమా అవకాశాలను ఈమె కోల్పోయింది . ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ముద్దు సన్నివేశాలు నటించింది .. 2022 తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా తో మృణాల్‌ ఠాకూర్ క్రేజ్‌ ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్థాయికి వెళ్ళింది . ఈ సినిమా దగ్గర్నుంచి మృణాల్‌ ఠాకూర్‌ వెనకు తిరిగి చూసుకోకుండా వ‌కరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: