బుల్లి పిట్ట: పాన్ కార్డ్ యూజర్స్ కి బ్యాడ్ న్యూస్.. అవన్నీ రద్దు..?

Divya
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలను తీసుకుంటూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో నోట్ల రద్దు వ్యవహారం నుంచి ఇప్పటివరకు ఎన్నో రకాల నిర్ణయాలను తీసుకుంటూనే ఉంది. ఇప్పుడు తాజాగా పాన్ కార్డ్-2.o ప్రాజెక్టును సైతం తీసుకురావడానికి ప్లాన్ చేస్తాందట. ఈ ప్రాజెక్టు కింద క్యూఆర్ కోడ్ తో కూడిన పాన్ కార్డును సైతం జారీ చేయబోతున్నారట. అందుకు సంబంధించి అప్డేట్ ప్రక్రియ పూర్తి ఉచితంగానే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.

ఆర్థిక లావాదేవుల వ్యవహారానికి సంబంధించి క్యాబినెట్ కమిటీ విడుదల ఈ ప్రకటనకు సుమారుగా 1435 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అసలు ఈ పాన్ 2.o ప్రాజెక్ట్ అంటే ఏమిటి? అనే ప్రశ్నలకు ఇప్పుడు ప్రజలలో మొదలుతున్నాయి. మళ్లీ వీటి వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయనే విషయంపై చర్చించుకుంటున్నారు. అయితే పాన్ 2.o అనేది ఈ గవర్నెన్స్ ప్రాజెక్టు కిందికి వస్తుందట.. దీనివల్ల పన్ను చెల్లింపుల దారుల రిజిస్ట్రేషన్ సేవలన వారి ప్రక్రియలు రీ ఇంజనీరింగ్ చేయబడతాయట. ఇది పన్ను చెల్లించే వారికి మెరుగైన డిజిటల్ అనుభవాన్ని కూడా అందించేలా చేస్తుందట.

అలాగే నాన్ క్రిటికల్ పాన్/టాన్ లాంటివి పాన్ ధ్రువీకరణ సేవలను ఏకీకృతం చేస్తుందట. ఇక పాన్ 2.o లో నాలుగు ముఖ్యమైన సాంకేతికలను తీసుకోవచ్చునట్లు సమాచారం. ఈ పాన్ కార్డ్ పూర్తిగా కాగిత రహిత ప్రక్రియలను కలిగి ఉంటుందట. అలాగే ఆన్లైన్ ప్రక్రియతో పాటు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కూడా ఇందులో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారట. అలాగే ఉమ్మడి వ్యాపారం గుర్తింపు పొందడానికి పాన్ మరియు DAN సేవలను విలీనం చేస్తున్నామని తెలిపారు. అలాగే వినియోగదారులు అందించే ప్రతి డేటాని కూడా సురక్షితంగా ఉంచేలా ఈ పాన్ వరల్డ్ సిస్టమని కచ్చితంగా చేస్తున్నామని తెలియజేశారు కేంద్ర మంత్రి వైష్ణవ్. పాత పాన్ కార్డులను రద్దు చేసే పాన్ కార్డ్ 2.o నీ తీసుకురాబోతున్నట్లు సమాచారం. పాన్ 2.o మరింత స్పీడుగా పనిచేస్తుందని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: