పెళ్లిపై సడన్ ట్విస్ట్ ఇచ్చిన కీర్తి సురేష్.. ఊహించలేదుగా..?
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే కీర్తి సురేష్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాతో తొలిసారి గ్లామర్ గర్ల్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం బోల్డ్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది కీర్తి సురేష్. ఇప్పటివరకు ఈమె గురించి పలు రకాల వార్తలు రాగా.. స్పందించని ఈమె తాజాగా ఈ వార్తలపై స్పందించింది. గత 15 సంవత్సరాలుగా ఆంటోనీ, నేను ప్రేమలో ఉన్నాము అంటూ తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటో ని కూడా షేర్ చేస్తూ...తాను ప్రేమలో ఉన్న విషయాన్ని డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చింది.
ఇకపోతే ఇది అభిమానులకు బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆ అబ్బాయి గురించి ఎక్కడ కూడా వార్తలు రాలేదు. అతడితో కలిసి దిగిన ఫోటోలు కూడా లేవు కానీ సడన్గా 15 ఏళ్ల ప్రేమ అనేసరికి అభిమానులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావ్ ఏంటి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. నిజంగానే నువ్వు గొప్ప మహానటివి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.