సూపర్ సిక్స్ ఎఫెక్ట్ : అమలు చేయాలంటూ రోడ్డెక్కిన నేతలు.. కూటమికి ఇబ్బందేనా..?

Divya
ఎన్నికలలో ప్రచారంలో భాగంగా అటు టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా పోటీ చేసినప్పటికీ మేనిఫెస్టోని మాత్రం టిడిపి ,జనసేన నేతలు సూపర్ సిక్స్ హామీలు అంటు ఎన్నికల ముందు ఊదరగొట్టారు. అయితే తీరా గెలిచిన తర్వాత ఈ హామీలను అమలు చేయడం కష్టం అన్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అయినప్పటికీ కూడా అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ కేవలం పింఛన్ పెంపు హామీను మాత్రమే అమలు చేశారు. మిగతా హామీలను అమలు చేయాలంటూ వాము పక్షాల నేతృత్వంలో పలువురు నేతలు ఆందోళన చేపట్టినట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కలెక్టర్ ముట్టడించినట్లు తెలుస్తోంది. సిపిఐ ,సిపిఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినప్పటికీ అక్కడికి రైతులు కార్మికులు ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారట. సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసి కలెక్టర్ ముట్టడించినట్లు తెలుస్తోంది.అదే సమయంలో విధులకు హాజరయ్యేందుకు వచ్చిన కలెక్టర్ వినోద్ కుమార్ వాహనం ముందు కూడా నిరసనలు తెలియజేస్తూ అడ్డుకున్నారట. దీంతో అనంతపురం కలెక్టర్ వద్ద కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుందని ఎన్నికలలో ఇచ్చిన హామీలలు జాప్యం ఎందుకు అంటూ నిలదీయడం జరిగిందట.
రైతులకు 20 వేల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తానంటూ ఎగరగొట్టారని అలాగే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో చదువుకుని పిల్లలకి ఇస్తానని చెప్పి అలాగే ఏడాదికి అందరికీరూ .15000 రూపాయలు ఇస్తానని చెప్పి పథకాలను అట్టకి ఎక్కించారంటూ నిరసనలు తెలియజేశారు.. అలాగే మహిళలకు కూడా మోసం చేశారని తెలిపారు. వాహన మిత్ర కింద ఆటో ,ట్యాక్సీ డ్రైవర్లకు సహాయం అందించకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటూ వామపక్షాలు ఆవేదన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం కొలువు తీరి ఇప్పటికి ఆరు నెలలు అవుతున్నప్పటికీ ఎలాంటి హామీలను నెరవేర్చకుండా కేవలం నిర్లక్ష్యం చేస్తుంది కూటమి ప్రభుత్వము అంటూ అనంతపురం కలెక్టర్ ను ముట్టడించారు.. అయితే ఇది ఇంకా శాంపుల్ మాత్రమే అని రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలలో కూడా ఇలాంటి బందులు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల కూటమికి కూడా చాలా ఇబ్బందులని పలువురు నేతలు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: