అతడితో బ్రేకప్ ఇలియానా కెరీర్ నే నాశనం చేసిందా..?

murali krishna
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఇలియానా ఇప్పుడు స్క్రీన్ పై కనిపించడమే మానేసింది.. ఈ భామ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.. కెరీర్ పీక్స్ లో వున్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్ కి వెళ్ళింది.. అక్కడ మొదట్లో బాగానే హిట్స్ వచ్చినా ఆ తరువాత ఈ భామకు వరుస ప్లాప్స్ వచ్చాయి.. దీనితో ఈ భామకు అవకాశాలు తగ్గాయి.. ఇలియానా డి క్రజ్ చాలా సీరియస్ యాక్టర్‌గా కనిపించినా కానీ నిజ జీవితంలో ఆమె చాలా ఫన్నీ.ఇలియానా, ఆండ్రూ కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కానీ ఈ జంట కొన్ని నెలల క్రితం తమ సంబంధాన్ని విడిచిపెట్టారు.ఆండ్రుతో రిలేషన్ లో వున్నప్పుడు ఇలియానా సినిమాలు మానేసి అతడిని పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉండాలని అనుకుందట. ఆ విషయాన్ని ఆండ్రూకి ముందుగానే చెప్పిందట. అప్పుడు ఎలాంటి సమస్య లేదని చెప్పిన ఆండ్రూ ఆ తరువాత మాత్రం ఇలియానాని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు... సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రేమలు, బ్రేకప్ లు చాలా కామన్ అభిప్రాయబేధాలు, ఈగో సమస్యల కారణంగా ప్రేమికులు ఒకరికొకరు దూరమవుతుంటారు...ఇంత కాలం ఇలియానా డబ్బులతో ఎంజాయ్ చేసిన ఆండ్రూ డబ్బులు రావడం ఆగిపోయేసరికి సినిమాలు చేయాలని ఇలియానా మీద ఒత్తిడి తెచ్చాడటా . అతడు పెడుతోన్న ప్రెషర్ ని, అతడి ప్రవర్తనని భరించలేక ఇలియానా అతడికి దూరమైందని అప్పట్లో న్యూస్ బాగా వైరల్ అయింది..అయితే ఆ తరువాత సడెన్ గా ఇలియానా బాగా బరువు పెరిగింది.. సినిమా ఛాన్సులు తగ్గాయి... కొన్నాళ్ళకి సడెన్ గా ప్రెగ్నెన్సీని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది... పెళ్లికాకముందే ప్రెగ్నెంట్ అయిందంటూ ఇలియానాకు సంబంధించిన వార్తలు అప్పట్లో నెటింట తెగ వైరల్ అయ్యాయి... గతేడాది ఈ బ్యూటీ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకు కోవా ఫినిక్స్ డోలన్‌ పుట్టిన తర్వాత భాగస్వామిని ఇలియానా పరిచయం చేసింది. తన ప్రియుడు.. భాగస్వామి.. మైకల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.తన ఇష్టాఇష్టాలను మైఖేల్ ఎంతో గౌరవిస్తాడని.. తన కొడుకు రాకతో వారిద్దరి జీవితాలు ఆనందంగా మారాయని ఆమె వివరించింది. అయితే ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్న టైంలో అమ్మ తనకు అండగా నిలిచిందని.. డెలివరీ తర్వాత ఒత్తిడికి లోనైతే తన భాగస్వామి మైఖేల్ సపోర్ట్ అందించాడని ఇలియానా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తన కొడుకు భాద్యత చూసుకుంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: