షారూఖ్ ఖాన్ నైరాశ్యం !
బాలీవుడ్ టాప్ హీరోగా కొన్ని సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగిన షారూఖ్ ఖాన్ కు ఆతరువాత వరస పరాజయాలు ఎదురయ్యాయి. గత సంవత్సరం జనవరి 25న విడుదలైన ‘పఠాన్’ మూవీ విడుదల అయ్యేంతవరకు వరస ఫ్లాప్ లు వల్ల షారూఖ్ మార్కెట్ బాగా దెబ్బతింది. అయితే ‘పఠాన్’ ఘన విజయంతో పాటు ఆతరువాత విడుదలైన ‘జవాన్’ ‘డంకీ’ మూవీలు కూడ సూపర్ సక్సస్ కావడంతో ఒక్కసారిగా షారూఖ్ సినిమాల పై క్రేజ్ పెరిగింది.
‘పఠాన్’ కంటే ముందు విడుదలైన అనేక సినిమాలతో పాటు అతడు నటించిన ‘జీరో’ సినిమా కూడ ఫెయిల్ అవ్వడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో షారూఖ్ కెరియర్ ప్రశ్నార్థకంగా మిగిలింది. అయితే ఆతరువాత అతడు నటించిన ‘జీరో’ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో షారూఖ్ తో సినిమాలు తీయాలి అనుకున్న నిర్మాతలు ఒక్కొక్కరుగా షారూఖ్ కు కాంపౌండ్ నుండి బయటకు వచ్చారు అన్నవిషయం షారూఖ్ దృష్టి వరకు రావడంతో ఎలర్ట్ అయిన ఈ బాలీవుడ్ హీరో ముంబాయ్ నిర్మాతలకు తన వంతు సహాయం చేయడంతో మళ్ళీ షారూఖ్ వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి.
షారూఖ్ క్రేజీ హీరో అయినప్పటికీ తన ఫెయిల్యూర్స్ ను చాల సులువుగా మర్చిపోలేకపోయాడు. తన బాధను ఎవరి దగ్గర ప్రదర్శించనని అంటూ తన బాధను తానే ఎదిరిస్తానని మనకు వ్యతిరేకంగా ఈ ప్రపంచం కుట్ర చేస్తోందని ఎప్పుడూ అనుకోకూడదు అని అంటున్నాడు. అంతేకాదు ఒక వ్యక్తి జీవితంలో ఫెయిల్ అయ్యాడు అంటే డానికి అనేక కారణాలు ఉంటాయి అని అంటున్నాడు..