ఒక్క డైలాగ్ కోసం.. రూ.450 కోట్ల పారితోషికమా.. షాకవుతున్న ఫ్యాన్స్?

praveen

హాలీవుడ్ హీరో విన్‌ డీసెల్ అదిరిపోయే సినిమాలు తీస్తూ ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయనకు చాలా మార్కెట్ వేల్యూ కూడా ఉంది. కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు వాయిస్ ఆర్టిస్ట్ గా కూడా ఇతను పనిచేస్తుంటాడు. దానికి కూడా బాగానే డబ్బులు తీసుకుంటాడు. మార్వెల్ సినిమాల్లో గ్రూట్ అనే చెట్టులాంటి పాత్రకు వాయిస్ ఇచ్చింది ఈ హీరోనే. ఆ పాత్రలో ఆయన ఎప్పుడూ "ఐ యాం గ్రూట్" అనే ఒక్క డైలాగు చెప్తూ ఉంటాడు. అంత చిన్న డైలాగు చెప్పే పాత్రకు విన్‌ డీసెల్‌కు దాదాపు 450 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారని ఒకప్పుడు వార్తలు వచ్చాయి. ఒక్క డైలాగు చెప్పినందుకే ఇంత భారీ మొత్తంలో జీతం ఇవ్వడం చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది. కానీ విన్‌ డీసెల్ తన వాయిస్ ద్వారా గ్రూట్ పాత్రకు ఎంతో ప్రాణం పోశాడు. ఆ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడానికి కారణం అతని వాయిసేనని చెప్పుకోవచ్చు. అందుకే ఆయనకు ఇంత ఎక్కువ జీతం ఇచ్చి ఉంటారని అంటారు.
అయితే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా దర్శకుడు జేమ్స్ గన్ ఈ పారితోషికం విషయంపై పెదవి విప్పారు. విన్‌ డీసెల్‌కు గ్రూట్ పాత్ర కోసం 450 కోట్ల రూపాయలు ఇచ్చారనే వార్త నిజం కాదని చెప్పారు. విన్‌ డీసెల్‌కు ఎంత జీతం ఇచ్చారో ఆయన చెప్పలేదు కానీ, వార్తల్లో వచ్చిన మొత్తం చాలా ఎక్కువ అని చెప్పారు.
గ్రూట్ కేవలం "ఐ యాం గ్రూట్" అనే ఒక్క డైలాగ్ చెప్పినా, విన్‌ డీసెల్ తన వాయిస్‌తో ఆ మాటకు చాలా భావాలు ఇచ్చాడు. గ్రూట్ సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా, గందరగోళంగా ఉన్నా, లేదా కాపాడాలని అనుకున్నా, విన్‌ డీసెల్ స్వరంతో అన్ని భావాలను తెలియజేశాడు. అందుకే గ్రూట్ పాత్ర ప్రేక్షకులకు ఫేవరెట్ గా నిలిచింది. అంతేకాకుండా, విన్‌ డీసెల్ ఆ మాటను వివిధ భాషల్లో కూడా చెప్పాడు. వార్తల్లో వచ్చిన జీతం నిజం కాకపోయినా, గ్రూట్ పాత్ర మార్వెల్ సినిమాల్లో చాలా ముఖ్యమైన పాత్ర. విన్‌ డీసెల్ వాయిస్ గ్రూట్ పాత్రకు ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: