హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. ఈమె రీసెంట్గా దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమాతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. అలా మోడలింగ్ మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ నిజంగానే అక్కినేని హీరోని పెళ్లి చేసుకోబోతుందా? సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఉన్న నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం.. మీనాక్షి చౌదరి రీసెంట్గా వచ్చిన ది గోట్ అలాగే తాజాగా విడుదలైన లక్కీ భాస్కర్ మూవీస్ తో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక అంతకుముందే ఖిలాడి, ఇచ్చిన వాహనాలు నిలపరాదు, గుంటూరు కారం సినిమాల్లో నటించినప్పటికీ ఈ సినిమాలు ఈ అమ్మడికి అంతగా క్రేజ్ అయితే తెచ్చి పెట్టలేదు.. కానీ ది గోట్,లక్కీ భాస్కర్ మూవీస్ తర్వాత మీనాక్షి చౌదరి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది అని మాత్రం అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ హీరోయిన్ కి చేతినిండా అవకాశాలు ఉన్నాయి. అలా బాలీవుడ్ లో కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అలాంటి మీనాక్షి చౌదరి నిజంగానే ఆ అక్కినేని హీరోని పెళ్లి చేసుకోబోతుందా అనేది ఇప్పుడు చూద్దాం.. అక్కినేని హీరోతో మీనాక్షి చౌదరి పెళ్లి అంటూ గత కొద్ది సంవత్సరాల నుండి ఒక వార్త వైరల్ అవుతుంది. దానికి ప్రధాన కారణం మీనాక్షి చౌదరి ఆ హీరోతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడమే. ఇక ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగార్జున మేనల్లుడు నటుడు సుశాంత్.. కాళిదాసు, కరెంటు,లవ్లీ, అడ్డా వంట సినిమాలతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ సుశాంత్ అంతగా రాణించలేకపోయారు.
అయితే బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోగా రాణించలేకపోవడంతో సుశాంత్ ని ఎవరు సినిమాల్లోకి తీసుకోలేదు. దాంతో స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. అలా రవితేజ నటించిన రావణాసుర, చిరంజీవితో భోళా శంకర్ వంటి సినిమాల్లో కనిపించారు. అయితే అలాంటి సుశాంత్ నటి మీనాక్షి చౌదరి కాంబోలో ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలు పీక్స్ కి చేరాయి.దీంతో మీనాక్షి చౌదరి అక్కినేని హీరోని పెళ్లి చేసుకోబోతుంది అని మీడియా మొత్తం కోడై కూసింది.కానీ ఈ రూమర్లపై ఇప్పటివరకు మీనాక్షి చౌదరి గానీ సుశాంత్ గానీ క్లారిటీ ఇవ్వలేదు