దంగల్ నటి మృతికి ఆ అరుదైన వ్యాధి కారణమా.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?
19 సంవత్సరాల వయస్సులో సుహానీ భట్నాకర్ మృతి చెందగా డెర్మాటోమియోసిటిస్ అనే అరుదైన వ్యాధి ఆమె మరణానికి కారణమైంది. ఒక ప్రమాదం వల్ల సుహానీకి కాలు ఫ్రాక్చర్ అయిందని ఆ సమయంలో వాడిన మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల డెర్మాటోమియోసిటిస్ వ్యాధి బారిన పడ్డారని తెలుస్తోంది. ఇన్ఫెక్షన్ వల్ల శరీరమంతా నీరు చేరగా చికిత్సకు కోలుకోలేక ఆమె మృతి చెందారు.
చికిత్సలో భాగంగా ఆమెకు ఇచ్చిన స్టెరాయిడ్స్ సైతం ఇమ్యూనిటీ సిస్టమ్ పై ఎఫెక్ట్ చూపి మరణానికి కారణమయ్యాయని తెలుస్తోంది. డెర్మాటోమియోసిటిస్ వ్యాధి ఆటో ఇమ్యూన్ వ్యాధి అని ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్లలో కండరాల బలహీనత మొదలై ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మందులను ఎక్కువగా వాడితే ప్రాణాలకే ప్రమాదమని సుహానీ మరణం ద్వారా అర్థమవుతుంది.
దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా దంగల్ నటి మరణం ఆమె అభిమానులను బాధ పెట్టింది. మరికొన్ని రోజుల్లో గ్రాడ్యుయేషన్ ను పూర్తవుతుందనే సమయంలో సుహానీ అనారోగ్య సమస్యలతో మృతి చెందడం కుటుంబ సభ్యులను ఎంతగానో బాధ పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సుహానీ కన్నుమూశారు. సుహానీ భౌతికంగా మృతి చెందినా తమ హృదయాల్లో జీవించే ఉన్నారని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. డెర్మాటోమియోసిటిస్ అరుదైన వ్యాధి కాగా ప్రపంచంలో ఐదుగురికి మాత్రమే ఉండే ఈ వ్యాధితో సుహానీ మరణించడం గమనార్హం.