రామ్ చరణ్ హీరో కాకుండా ఉంటే ఆ ప్రొఫెషన్ లో సెటిల్ అయ్యుండేవాడా..? అందరు చేతులు ఎత్తి దండం పెట్టుండేవారు..!
చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి అస్సలు సంబంధం ఉండదు. పెద్ద పెద్ద బీటెక్ చదువులు చదివి కూడా చిన్న షాపుల్లో గుమస్తాగా పనిచేస్తున్న కుర్రాళ్ళు ఎంతో మంది ఉన్నారు . అదే విధంగా డాక్టర్ చదువు చదివి సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చదువుకు సంబంధం లేకుండా ఎన్నో పనులు చేస్తున్నారు . ఇదే క్రమంలో స్టార్స్ కూడా తమ లైఫ్ లో ఒక ప్రొఫెషన్ ల్లో సెట్ అవ్వాలి అనుకొని మరొక ప్రొఫెషనల్ లో సెటిల్ అయినా దాని గురించి మాట్లాడుకుంటున్నారు .
మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకొని గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ అసలు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకోలేదట . తండ్రి పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ రామ్ చరణ్ ఎక్కువగా పోలీస్ అవ్వాలని ఆలోచనలోనే ఉన్నాడట . మొదటి నుంచి రాంచరణ్ పోలీసులు అంటే చాలా చాలా గౌరవం . అంతేకాదు రామ్ చరణ్ పోలీసులు పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటారు . ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆయన డ్రీమ్ రోల్ లో నటించాను అంటూ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఒకవేళ రామ్ చరణ్ హీరో అవ్వకపోయి ఉంటే మాత్రం కచ్చితంగా ఆయన పోలీస్ గానే సెటిలై ఉండేవారట. దీంతో ఇది తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ షాక్ అయిపోతున్నారు . అలా చేసుంటే రాం చరణ్ కి అందరు చేతులు ఎత్తి దండం పెట్టుండేవారు..!