సంక్రాంతికి వచ్చాడు అంటే నాగ్ కి బ్లాక్ బస్టర్ పడాల్సిందే.. ఏకంగా అన్ని హిట్లు..?

MADDIBOINA AJAY KUMAR
మన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో కొంత మంది సంక్రాంతి పండుగకు తన సినిమాలను విడుదల చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలా సంక్రాంతి కి సినిమాలను విడుదల చేయడం లో అత్యంత ఆసక్తిని చూపించే స్టార్ హీరోలలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈయన కెరియర్ లో చాలా సినిమాలను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశాడు. అందులో చాలా మూవీ లు అద్భుతమైన విజయాలను కూడా నాగార్జున అందుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో నాగార్జున సంక్రాంతి పండుగ సందర్భంగా తన సినిమాలను విడుదల చేసి దాదాపు అన్ని మూవీలతో కూడా విజయాలను అందుకున్నాడు.

కొంత కాలం క్రితం నాగార్జున "సోగ్గాడే చిన్నినాయన" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక సోగ్గాడే చిన్నినాయన సినిమాకు కొనసాగింపుగా నాగార్జున "బంగార్రాజు" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయగా ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా హీరోగా నటించాడు.

నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఈ మధ్య కాలంలో నాగార్జున సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా మూడింటితో కూడా మంచి విజయాలను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: