2016 సంక్రాంతి : ఏకంగా నాలుగు సినిమాల మధ్య పోటీ.. ఒకే మూవీ కి చేదు అనుభవం..?

Pulgam Srinivas
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. దాదాపు ఇలాంటి వాతావరణం ప్రతి సంక్రాంతికి ఉంటుంది. 2016 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా థియేటర్ల దగ్గర భారీ స్థాయిలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఏకంగా నాలుగు సినిమాలు ధియేటర్లలో విడుదల అయ్యాయి.

2016 సంక్రాంతి పండుగ సందర్భంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన నాన్నకు ప్రేమతో , శర్వానంద్ హీరోగా రూపొందిన ఎక్స్ప్రెస్ రాజా , నాగార్జున హీరోగా రూపొందిన సోగ్గాడే చిన్నినాయన , బాలకృష్ణ హీరోగా రూపొందిన డిక్టేటర్ సినిమాలు విడుదల అయ్యాయి. ఇకపోతే ఈ నాలుగు సినిమాలపై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ నెలకొని ఉండడంతో ఈ నాలుగు మూవీలలో ఏ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది. చివరగా సంక్రాంతి విన్నర్ గా ఏ మూవీ నిలుస్తుంది అనే ఆసక్తి మొదటి నుండి కూడా తెలుగు ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇకపోతే ఈ సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన నాన్నకు ప్రేమతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే శర్వానంద్ హీరోగా రూపొందిన ఎక్స్ప్రెస్ రాజా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక నాగార్జున హీరోగా రూపొందిన సోగ్గాడే చిన్నినాయన సినిమా మాత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక బాలకృష్ణ హీరోగా రూపొందిన డిక్టేటర్ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయం మాత్రమే అందుకుంది.

ఇక 2016 వ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల అయిన ఈ నాలుగు సినిమాలలో నాన్నకు ప్రేమతో , ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో మంచి విజయాలను అందుకోగా , డిక్టేటర్ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సంవత్సరం సోగ్గాడే చిన్నినాయన సినిమా సంక్రాతి విన్నర్ గా నిలవగా , డిక్టేటర్ మూవీనే ఈ నాలుగు సినిమాలలో కాస్త పేలవామైన విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: