నెట్ ఫ్లిక్: రివెంజ్ డ్రామా తో అదరగొడుతున్న యాక్షన్ మూవీ.. చూశారా..?
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే సముద్ర తీర ప్రాంతం ఎంతోమంది మత్స్య కారులు ఆ సముద్రం పైనే ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇమ్మాన్యూయేల్(ఆంటోనీ వర్గీస్) అక్కడే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అక్కడ ఎవరైనా కరెన్సీ, కండబలంతో తమ జీవితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన ఎదురెళ్లి వ్యక్తిగా ఉంటారు. అయితే అలాంటి సమయంలోనే ఒక కొత్త బృందంతో చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తారు. అయితే అందులోనే ఆ బోటు యజమాని మేనల్లుడు జూడు (షబీర్) అందులో ఉంటారట. అలా షబ్బీర్ గ్యాంగ్ తో కలిసి ఇమ్మాన్యూయేల్ బోటులో వెళ్తారు.
ఇక ఈ బోటు లో వారందరూ కూడా ఇమ్మాన్యుయేల్ మీద ఒక కన్నేసి తనని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉంటారు.. అలా ఆ బోటులో అలోసి అనే వ్యక్తి గాయపడగా బోటు తిప్పమని ఇమ్మాన్యుయేల్ ఎంత అరిచినా కూడా అంగీకరించారు. దీంతో చివరికి ఆలోసి మరణిస్తారు. అలా జూడుతో ఇమ్మాన్యుయేల్ శత్రుత్వం భారీగా పెరుగుతుంది. దీంతో జోడు స్నేహితులకు ఎదురెళ్లిన వారందరిని చంపేస్తూ ఉంటారని అక్కడ వంట పని చేసే కొండారి చెబుతూ ఉంటారు.. అలా ఒక వ్యక్తిని చంపేశారని తెలుపుతారు.. ఆ కనపడని వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చాను అంటూ ఇమ్మాన్యుయేల్ తెలియజేయడంతో కొండారి భయంతో ఈ విషయాన్ని వెళ్లి జూడు వర్గానికి తెలియజేస్తారు. ఈ విషయం విన్న జూడు స్నేహితులతో పాటు ఏం చేస్తారు..? అసలు తప్పిపోయిన డేనియల్ ఎవరు? ఇమ్మాన్యుయేల్ ఎందుకు వచ్చారు అనే అంశమే ఈ సినిమా..
ముఖ్యంగా ఈ సినిమా కథ చుట్టూ సముద్రం బోటు మధ్యలోనే జరుగుతూ ఉంటుంది. కానీ డైరెక్టర్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా పాత్రలను చాలా బాగా చిత్రీకరించారు. ముఖ్యంగా మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి వారు సముద్రంలోకి వేటకు వెళ్లిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని విషయాలను చూపించారు. అలాగే ఇలా వెళ్లిన వారిలో గ్రూపు తగాదాలు ఏర్పడితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని చాలా క్లియర్ గా చూపించారు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలకి జీవం పోసి నటించారు. తక్కువ బడ్జెట్ తెరకెక్కించిన ఈ యాక్షన్ త్రిల్లర్ సినిమా ప్రస్తుతం నెట్ ఫిక్స్ లో అదరగొట్టేస్తోంది.