'దేవర' ఊచకోత...కరోనా తర్వాత మొదటి సినిమాగా రికార్డు ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్.... ఇటీవల దేవర సినిమాతో... తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఇటీవల... అంటే సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
 రిలీజ్ అయిన రోజున నెగిటివ్ టాక్  తెచ్చుకున్న దేవర సినిమా... సాయంత్రం వరకు మళ్లీ పాజిటివ్ మూడులోకి.. వెళ్లడం జరిగింది. ఈ తరుణంలోనే... సినిమా వరుసగా  కలెక్షన్లను రాబడుతూ.. బాహుబలి 2 లాంటి సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది దేవర మూవీ. అయితే లేటెస్ట్ గా కలెక్షన్ల పరంగా మరో సంచలన రికార్డు నమోదు చేసింది దేవర సినిమా.
 కలెక్షన్లలో... కరోనా తర్వాత ఏ సినిమా అందుకొని రికార్డును సృష్టించింది. దేవర సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అంటే 18 రోజులపాటు.... ఈ సినిమా కనీసం రోజుకు కోటి రూపాయల చొప్పున వసూలు చేయడం జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే చిత్ర బృందం అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. కరోనా సమయం తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన ఏకైక సినిమాగా దేవర సినిమా నిలిచింది.
 అంతేకాదు సీడెడ్ లో కూడా 30 కోట్ల కలెక్షన్లను దాటిపోయింది దేవర సినిమా. దీంతో ఆ ఏరియాలో 30 కోట్లు దాటిన రెండు సినిమాలు ఉన్న వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ రికార్డు లోకి ఎక్కాడు. ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా 510 కోట్ల గ్రాస్ ను రాబట్టడం గమనార్హం. ఇది ఇలా ఉండగా దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పని చేయగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: